Shruti Haasan : సొంతంగా ఇల్లు కొని ఒంటరిగా గృహప్రవేశం చేసిన శృతి హాసన్.. అసలేం జరిగింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్. ఒక భాషకు పరిమితం కాకుండా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్గా కూడా కొనసాగింది. అయితే తాజాగా ఈ భామ తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఒక సొంత ఇంటిని కొనుగోలు చేసింది. నిజానికి చెన్నై నగరంలో కమల్ హాసన్‌కు ఎన్నో వేల కోట్ల విలువైన భూములు, సొంత భవనాలు ఉన్నాయి. అయినా కూడా తండ్రి ఆస్తుల మీద ఆధారపడకుండా, తాను సంపాదించిన సొమ్ముతో శృతిహాసన్ ఒక నివాసాన్ని కొనుగోలు చేయడం విశేషం.
నిజానికి గత కొన్ని ఏళ్లుగా ముంబైలోనే ఎక్కువగా గడుపుతున్న శృతిహాసన్, ఇప్పుడు తన సొంత గడ్డ అయిన చెన్నైతో మరింత బంధాన్ని బలోపేతం చేసుకునేందుకు అక్కడ ఇంటిని కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఇక ఈ కొత్త ఇంట్లో శృతిహాసన్ సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి గృహప్రవేశం చేసింది. అయితే తమిళ సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు, ఈ వేడుకలో శృతిహాసన్ ఒంటరిగానే పాల్గొని పూజా విధులు పూర్తి చేసినట్లు చెబుతున్నారు. ఈ గృహప్రవేశం సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ఎవరూ అక్కడ కనిపించకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ మధ్యనే ఒక క్రేజీ సినిమాలోని స్పెషల్ సాంగ్‌లో మెరిసిన ఆమె, ‘సలార్ 2’లో ప్రభాస్ సరసన కూడా నటిస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Tata Aeris vs Hyundai Aura.. డిజైన్, ఫీచర్లు, సేఫ్టీ, ఇంజిన్‌తో పాటు ఫ్యామిలీకి ఏది బెస్ట్ ఛాయిస్..?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI 2nd ODI: ఆ ముగ్గురు టీమిండియా స్టార్లకు నిరాశే.. ప్లేయింగ్ 11, హెడ్ టు హెడ్, పిచ్ రిపోర్ట్ ఇదే!
-
OPPO Reno 16T లాంచ్.. 200MP కెమెరా, 6700mAh బ్యాటరీ, ధర ఎంతంటే..?
-
AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
ట్రెండింగ్
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?