ఇంగ్లండ్ యువ వికెట్ కీపర్ జేమీ స్మిత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టెస్టుల్లో వెయ్యి పరుగుల మార్కును అందుకున్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి రన్స్ చేసి.. దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్ సరసన నిలిచాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు […]
Most Test Hundreds List: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదవ బ్యాటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. లార్డ్స్ మైదానంలో టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో సెంచరీ చేయడంతో రూట్ ఖాతాలో ఈ రికార్డు చేరింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ద్రవిడ్ సహా ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ పేరిట సంయుక్తంగా ఉంది. […]
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గిరయ్యది. కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కొందరు గోపిపై రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తల, మెడపై తీవ్ర గాయాలు కావడంతో గోపి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడిఉన్న గోపి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బైక్‌పై వెళ్తుండగా గోపిపై […]
HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ […]
జనసేన పార్టీ కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించిన విషయం తెలిసిందే. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. జనసేన పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడం పట్ల టీవీ రామారావు విచారం వ్యక్తం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని చెప్పారు. కార్యకర్తల మనోభవాలు దెబ్బతిన్న కారణంగా ఆగ్రహంతో రోడ్డెక్కారని స్పష్టం చేశారు. అధిస్థానం తీసుకున్న […]
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గిట్టుబాటు ఇవ్వడం లేదని వైసీపీ మాజీమంత్రి పేర్ని నాని మండిపడ్డారు. రైతుల వద్దకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెళ్తే ఏడుస్తారు అని కూటమి ప్రభుత్వంను విమర్శించారు. ఏపీలో రైతుల పరిస్థితులు దయనీయంగా ఉండటం సమాజానికి విచారకరం అని పేర్కొన్నారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా కూటమి ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి జగన్ గారిని తిట్టడానికి తప్ప ఎక్కడైనా తిరిగారా? […]
జింబాబ్వేతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్డర్ 367 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. టెస్టుల్లో రికార్డు స్కోర్ 400 పరుగులు చేసే ఛాన్స్ వచ్చినా.. కావాలనే వదిలేసుకున్నాడు. టెస్ట్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాపై ఉన్న గౌరవంతోనే 400 పరుగులు చేయలేదని ముల్డర్ తెలిపాడు. ముల్డర్ వ్యాఖ్యలపై లారా స్పందించాడు. క్రికెట్ దిగ్గజం లారాతో జరిగిన సంభాషణను తాజాగా […]
కంటే కూతుర్నే కనాలి అంటారు. చివరి దశలో తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటుందని ఇలా చెబుతారు. కానీ హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ కూతురు చేసిన పని వింటే.. కంటే ఇలాంటి కూతుర్ను మాత్రం కనొద్దని చెప్పుకుంటారు. తుచ్ఛమైన వివాహేతర బంధం కోసం ఏకంగా కన్న తండ్రినే పొట్టన పెట్టుకుంది ఆ కసాయి కూతురు. ముషీరాబాద్ ముగ్గుబస్తీకి చెందిన వడ్లూరి లింగం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇతని భార్య శారద జీహెచ్ఎంసీలో స్వీపర్‌గా పని చేస్తోంది. వీళ్ల కూతురు మనీషాకు […]
చూడటానికి అచ్చం పాల లాగే ఉంటాయి.. కానీ పాలు కాదు. ప్రమాదకర రసాయనాలతో వాటిని తయారు చేసి నాణ్యమైన, స్వచ్ఛమైన పాలు అని చెప్పి అమ్మేస్తున్నారు కొంత మంది దుండగులు. కనీసం చిన్న పిల్లలు తాగుతారన్న సోయి కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వారి భరతం పట్టారు రాచకొండ పోలీసులు. ఇంకా చెప్పాలంటే పలు ప్రమాదకర రసాయనాలు మిక్స్ చేసి తయారు చేసిన పాలు ఇవి. వీటిని స్వచ్ఛమైన పాలు అని నమ్మించి జనానికి అమ్మేస్తున్నారు కొందరు […]
స్మార్ట్ ఫోన్లు వచ్చాక సైబర్ నేరగాళ్ల పని ఈజీ అవుతోంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సులభంగా జనాన్ని బురిడీ కొట్టించేస్తున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ వలకు చిక్కిన అమాయకులు.. డబ్బులు నష్టపోవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తోంది. తాజాగా కూకట్పల్లి హౌజింగ్ బోర్డులో ఓ మహిళ సైబర్ నేరగాళ్లకు చిక్కి ఉసురు తీసుకుంది. ఆన్లైన్లో అమాయకులు తగిలితే చాలు.. ఇట్టే మోసం చేస్తున్నారు. సులభంగా డబ్బు సంపాదించడంపై అందరికీ ఆసక్తిగానే ఉంటుంది. […]