2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ కుటుంబం క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు తాము చాలా భాధపడ్డాం అని వైసీపీ నేత జక్కంపూడి గణేష్ తెలిపారు. ల్యాండ్ మాఫియా, బెట్టింగ్ క్లబ్‌ల మీద తమపై చేసిన ఆరోపణలు నిరూపించమని ప్రశ్నిస్తున్నామన్నారు. తమపై ఆరోపణలు రుజువు చేయండి, లేదంటే చేతగాని వాళ్లమని ఒప్పుకోండన్నారు. తమ క్యారెక్టర్‌పై పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుందని జక్కంపూడి గణేష్ హెచ్చరించారు. Also Read: TV Rama Rao: జనసేన […]
జనసేన కొవ్వూరు నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును అధిష్టానం తప్పించింది. ఈ మేరకు పార్టీ కాప్లిక్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కొవ్వూరు నియోజకవర్గంలోని సహకార సొసైటీల నియామకాల్లో అన్యాయం జరిగిందని టీవీ రామారావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. కొవ్వూరు టోల్ గేట్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. కొవ్వూరు నియోజకవర్గంలోని 14 సొసైటీలు ఉండగా.. దీనిలో మూడు పదవులు తమకు కేటాయించాలని […]
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పంతుళ్ల లొల్లి చర్చనీయాంశంగా మారింది. ఈవో శీనా నాయక్‌పై పంతుళ్లు అలకబూనారు. ఈరోజు ఇంద్రకీలాద్రిపై శాకాంభారీ ఉత్సవాలు ఆఖరి రోజు కావడం, అందులోనూ గురు పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. భక్తులతో ఇంద్రకీలాద్రి మొత్తం కిక్కిరిసిపోయింది. కొండపైన ఎక్కడ చూసినా భక్తులే ఉన్నారు. Also Read: ENG vs IND: బజ్‌బాల్‌పై వెనక్కి తగ్గిన ఇంగ్లండ్.. ఇదే మొదటిసారి! 300 రూపాయలు క్యూ లైన్లో రూ.100 […]
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి రోజులో రెండో సెషన్ ముగిసింది. మొదటి సెషన్లో భారత్ ఆధిపత్యం సాధించగా.. రెండో సెషన్లో ఇంగ్లండ్ ఆధిపత్యం చెలాయించింది. 24 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 70 రన్స్ చేసింది. జో రూట్ (54) హాఫ్ సెంచరీ చేయగా.. ఓలీ పోప్ (44) అర్ధ శతకం దిశగా సాగుతున్నాడు. రెండో సెషన్లో ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు కష్టపడ్డా ఫలితం దక్కలేదు. […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు మల్కాజ్గిరి కోర్టు రిమాండ్ విధించింది. హెచ్‌సీఏ స్కామ్‌లో 12 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. జగన్మోహన్తో పాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన సతీమణి కవితకు మల్కాజ్గిరి కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. కవితను చంచల్ గూడ జైలుకు, మిగతా వారిని చర్లపల్లి జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. Also Read: Kanipakam Temple: విరిగిన […]
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి విరిగిన పాలతో అభిషేకం చేశారు అనేది అవాస్తవం అని ఆలయ ఈవో పెంచుల కిషోర్ చెప్పారు. కొందరు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, వాటిని భక్తులు నమ్మొద్దన్నారు. టెండర్ దారుడు ఇద్దరు భక్తులకు విరిగిన పాలను అందించారని, ఆ ఇద్దరు భక్తులు అతనితో వాద్వాదించుకొని వెళ్లిపోయారని తెలిపారు. ఆ పాలను అభిషేకానికి వినియోగించలేదని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో అర్చకులు పరిశీలించిన అనంతరమే స్వామివారికి అభిషేకం చేపట్టారన్నారు. […]
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది ఇలాంటి దాడులు చేయిస్తుందన్నారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారని విమర్శించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇప్పుడే వచ్చి అరెస్టు చేసుకోవచ్చన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం అని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసన్న కుమార్ […]
ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తెలుగు ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి మెరిశాడు. ఓకే ఓవర్లో రెండు వికెట్స్ పడగొట్టి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 14 ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్ (23) అవుట్ కాగా.. చివరి బంతికి జాక్ క్రాలీ (18) పెవిలియన్ చేరాడు. ఇద్దరు ఓపెనర్లు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చారు. రెండు వికెట్స్ పడగొట్టిన తెలుగు కుర్రాడిపై ప్రశంసలు కురుస్తున్నాయి. […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావును తెలంగాణ సీఐడీ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో టికెట్ల వివాదం నేపథ్యంలో చేపట్టిన దర్యాప్తులో ఆర్థిక అక్రమాలు వెలుగుచూడటంతో.. జగన్మోహన్ని సీఐడీ అదుపులోకి తీసుకుంది. జగన్మోహన్తోపాటు హెచ్‌సీఏ కోశాధికారి శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్, ప్రధాన కార్యదర్శి రాజేందర్ యాదవ్, ఆయన భార్య కవితలను సీఐడీ అరెస్ట్ చేసి విచారించింది. ఈ కేసులో సంచలన విషయాలు […]
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు జగన్మోహన్ రావు అక్రమాల చిట్టా కలకలం రేపుతోంది. హెచ్‌సీఏలో జగన్మోహన్ రావు అక్రమాలకు అంతే లేదు. హెచ్‌సీఏలోకి అడ్డదారిలో వచ్చిన ఆయన.. వందల కోట్లు దోపిడీ చేశారు. క్రికెట్ అభివృద్ధికి బీసీసీఐ ఇస్తున్న నిధులను జగన్మోహన్ రావు దుర్వినియోగం చేశారు. ఎస్ఆర్హెచ్, హెచ్‌సీఏ వివాదంలో విజిలెన్స్ నివేదిక ఆధారంగా బుధవారం జగన్మోహన్ రావును సీఐడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నేడు మల్కాజిగిరి కోర్టులో ఆయన్ను సీఐడీ హాజరుపరచనుంది. జగన్మోహన్తో […]