శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన వైసీపీ నేత, ఉప సర్పంచ్ సత్తారు గోపి దారుణ హత్యకు గిరయ్యది. కోయిరాల జంక్షన్ సమీపంలో గుర్తు తెలియని దుండగులు కొందరు గోపిపై రాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. తల, మెడపై తీవ్ర గాయాలు కావడంతో గోపి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో పడిఉన్న గోపి మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. బైక్‌పై వెళ్తుండగా గోపిపై ఏడుగురు వ్యక్తుల దాడి చేసినట్లు తెలుస్తోంది.
Also Read: HCA Scam: హెచ్‌సీఏ స్కామ్.. రంగంలోకి ఈడీ!
సత్తారు గోపి దారుణ హత్య నేపథ్యంలో జాతీయ రహదారిపై బంధువుల ఆందోళనకు దిగారు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. సత్తారు గోపి హత్యపై కేసు నమోదు చేశారు. ఎంపీపీ మగతలవలస చిరంజీవి అనుచరుడే సత్తార్ గోపి. ఈ హత్యపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.