ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ నడుస్తోంది. 2025 నవంబర్ 28న ప్రారంభమైన బ్లాక్ ఫ్రైడే సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహోపకరణాలు, గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో గూగుల్ కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గూగుల్ పిక్సెల్ 10’పై భారీ డిస్కౌంట్ ఉంది. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.14,000 కంటే ఎక్కువ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఇది అద్భుత ఆఫర్స్ అనే చెప్పాలి. ఎందుకంటే.. కొత్తగా […]
ఏడాది కాలంలో స్వదేశంలో టెస్టుల్లో భారత్ రెండు వైట్‌వాష్‌లను ఎదుర్కొంది. భారత గడ్డపై న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశాయి. 2024 నవంబర్‌లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో సిరీస్ ఓడిపోవడం భారత క్రికెట్ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా నిలిచింది. 2025 ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో వైట్ వాష్‌కు గురవడం ప్రతి ఒక్కరిని షాక్‌కు గురిచేసింది. ఈ రెండు వైట్‌వాష్‌లు గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేప్పట్టాకే జరిగాయి. […]
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ వరల్డ్ రికార్డ్ ముందు నిలిచాడు. మరో మూడు సిక్స్‌లు కొడితే.. అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈరోజు రాంచి వేదికగా దక్షిణాఫ్రికా జరగనున్న తొలి వన్డేలో రోహిత్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్.. రాంచి వన్డేలోనే ప్రపంచ రికార్డ్‌ను బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. రాంచిలో కాకపోయినా.. రాయపూర్, విశాఖపట్నం వన్డేలలో అయినా హిట్‌మ్యాన్ ఈ రికార్డును […]
కమ్యూనికేషన్ యాప్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సిమ్ బైండింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది. అంటే.. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, అరట్టై, జోష్ వంటి ప్రసిద్ధ యాప్‌లు ఇకపై యాక్టివ్ సిమ్ కార్డ్ లేకుండా పనిచేయలేవు. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే యాప్‌లు పనిచేసేలా చూడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సూచించింది. టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నియమాలు 2025 ప్రకారం ఈ నియమాన్ని కేంద్రం అమలు చేసింది. […]
Just Corseca Launches Sonic Bar and Sound Shock Plus Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జస్ట్ కోర్సెకా’ రెండు సరికొత్త సౌండ్బార్లను రిలీజ్ చేసింది. దాంతో హోమ్ ఆడియో డివైజ్ రంగంలోకి జేసీ కంపెనీ ప్రవేశించింది. జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ సౌండ్బార్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండు మోడళ్లలో 2.2-ఛానల్ సెటప్, సబ్ వూఫర్ ఉన్నాయి. అవి 200W వరకు సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ […]
ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థ అమెజాన్‌లో ‘బ్లాక్ ఫ్రైడే సేల్’ 2025 నడుస్తోంది. నవంబర్ 28న ప్రారంభమైన ఈ సేల్.. డిసెంబర్ 1 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో అన్ని ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. మీరు బడ్జెట్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. రెడ్మీ, షావోమీలను మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అమెజాన్ సేల్ సమయంలో ఫ్లాట్ డిస్కౌంట్లతో పాటు మీరు బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు. అలానే ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికలను కూడా […]
నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో కొనసాగుతున్న ‘దిత్వా’ తుపాను తమిళనాడుపై పంజా విసురుతోంది. తమిళనాడులో శనివారం అర్దరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరు, మైలాడుతురై, నాగపట్నం, రామనాథపురం,తంజావూరు, తిరువారూరు, కోయంబత్తూరులో కుండపోత వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో 62కు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై-శ్రీలంక విమాన సర్వీలు రద్దయ్యాయి. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీరంలో దిత్వా తుఫాన్ కొనసాగుతోంది. పుదుచ్చేరికి దక్షిణ ఆగ్నేయంగా […]
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆదివారం రాంచిలో తొలి వన్డే మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్న టీమిండియా.. వన్డే సిరీస్ అయినా గెలవాలని చూస్తోంది. ఏడాదికి పైగా విరామం తర్వాత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. దాంతో అందరి దృష్టీ రో-కోల పైనే ఉంది. ఈ […]
అమరావతి నగరాన్ని నిర్మించటంలో రైతుల పాత్ర కీలకం అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నూతన రాజధాని అమరావతిని మరలా పునఃప్రారంభించటం మంచి శుభదాయకం అని, ప్రధాని మోడీ వచ్చి మంచి సపోర్ట్ ఇచ్చారన్నారు. నూతన రాజధాని నిర్మించటం సాధారణ విషయం కాదన్నారు. ఫైనాన్స్ సెక్టార్ ఉండాలనే ఉద్దేశంతో 15 బ్యాంకుల నిర్మాణ కార్యక్రమం ఉండటం మంచిదని, దేశంలోనే ఇది మొదటిసారి అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా చూసుకుంటాం అని కేంద్ర మంత్రి […]
ఇటీవలే ప్రధాని మోడీ వచ్చి అమరావతి పనులు పునఃప్రారంభించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. 2028 మార్చ్ నాటికి పూర్తి చేసేలా పనులు జరుగుతున్నాయని చెప్పారు. అమరావతి రైతుల సహకారం మరువలేనిదని పేర్కొన్నారు. రాజధానికి కేంద్ర సహకారంతో పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం రూ.15 వేల కోట్లు రాజధానికి ఇచ్చిందన్నారు. అమరావతిని వినూత్న నగరంగా నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. అమరావతిలో బ్యాంకుల […]