JC Soundbars: జస్ట్ కోర్సెకా నుంచి సరికొత్త సౌండ్‌బార్‌లు.. అతి తక్కువ ధరలో 200W ఆడియో ఔట్‌పుట్! ఇక ఇంట్లో డబిడదిబిడే
- సరికొత్త సౌండ్‌బార్‌లను రిలీజ్ చేసిన జస్ట్ కోర్సెకా
- హోమ్ ఆడియో డివైజ్ రంగంలోకి జేసీ కంపెనీ
- అతి తక్కువ ధరలో 200W ఆడియో ఔట్‌పుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Just Corseca Launches Sonic Bar and Sound Shock Plus Soundbars: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ‘జస్ట్ కోర్సెకా’ రెండు సరికొత్త సౌండ్‌బార్‌లను రిలీజ్ చేసింది. దాంతో హోమ్ ఆడియో డివైజ్ రంగంలోకి జేసీ కంపెనీ ప్రవేశించింది. జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ సౌండ్‌బార్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. రెండు మోడళ్లలో 2.2-ఛానల్ సెటప్, సబ్ వూఫర్ ఉన్నాయి. అవి 200W వరకు సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తాయి. ఈ సౌండ్‌బార్‌లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో కొనుగోలు చేయవచ్చు.
జస్ట్ కోర్సెకా సోనిక్ బార్ 2.2 ఛానల్ లేఅవుట్‌తో కూడిన సబ్ వూఫర్‌ను కలిగి ఉంటుంది. ఇది వైర్‌లెస్, వైర్డ్ కనెక్టివిటీ ఎంపికలతో వచ్చింది. ఇది 200W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. 120W సౌండ్‌బార్ నుంచి, 80W సబ్ వూఫర్ నుంచి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ v5.0, HDMI ARC, కోక్సియల్, USB సహా AUX ఉన్నాయి. మీరు దీన్ని టీవీ, ప్రొజెక్టర్, ఫోన్, పీసీ, ల్యాప్‌టాప్‌కు ఉపయోగించవచ్చు.
Also Read
- iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
- Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- OPPO Find X10 Pro Max: 200MP + 200MP + 200MP కెమెరాలతో ఒప్పో ఫైండ్ ఎక్స్10 సిరీస్.. భారత్‌లో లాంచ్ డేట్ ఫిక్స్
జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ 160W సౌండ్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. సౌండ్‌బార్ నుంచి 90W, సబ్ వూఫర్ నుండి 60W అవుట్‌పుట్ మనకు అందిస్తుంది. ఈ సౌండ్‌బార్ 2.2 ఛానల్ ఆడియోతో కూడా వస్తుంది. మీరు కనెక్టివిటీ ఎంపికలను కూడా పొందుతారు. ఈ సౌండ్‌బార్‌లో TF కార్డ్, FMని కూడా ఉపయోగించవచ్చు.
Also Read: Amazon Sale 2025: రెడ్‌మీ ఫోన్‌లపై ఆఫర్ల జాతర.. 12 వేలకే Redmi 13 5G, 8 వేలకే Redmi A4 5G!
జస్ట్ కోర్సెకా సోనిక్ బార్, జస్ట్ కోర్సెకా సౌండ్ షాక్ ప్లస్ మోడళ్లలో సౌండ్‌బార్, సబ్ వూఫర్, ఛార్జింగ్ కేబుల్ సహా రిమోట్ కంట్రోల్ ఉన్నాయి. సోనిక్ బార్ ధర రూ.7,499 కాగా.. సౌండ్ షాక్ ప్లస్ ధర రూ.6,499. రెండు సౌండ్‌బార్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్ సహా రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఒక సంవత్సరం వారంటీని కూడా అందిస్తోంది.
తాజావార్తలు
-
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
-
iPhone Duo: స్క్రీన్ పగిలితే రూ. 1.5 లక్షలు గోవిందా.. ‘ఐఫోన్ డ్యుయో’తో జర భద్రం!
-
Lenovo IdeaPad Vibe 15Q8X12: లెనోవా IdeaPad Vibe 15Q8X12 లాంచ్.. Snapdragon X ప్రాసెసర్, 15-ఇంచ్ డిస్‌ప్లే
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!