మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది..
ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క చోట వీళ్ల దందాలు చేస్తూంటారు. తాజాగా ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ లో డబ్బులు వసూలు చేస్తూ.. కనిపించాడు. కారులో వెళుతున్న ఓ వ్యక్తిని ఆపి పార్కింగ్ ఫీజు చెల్లించాలంటూ.. అతడి దగ్గర ఉన్న క్యూర్ ఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పంపాలన్నాడు. అయితే కారులో ఉన్న వ్యక్తి.. ఆ క్యూఆర్ కోడ్.. అతడి పర్సనల్ అకౌంట్ కు లింక్ ఉండడంతో.. అతడి నకీలీ దందా బయట పడింది. కారులో ఉన్న వ్యక్తి డబ్బులు ఇవ్వనని చెప్పాడు.. సదరు వ్యక్తి.. కారులో ఉన్న వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు.
బాలీవుడ్ హీరోలతో కలిసి డ్యాన్స్ చేసిన ట్రంప్ కుమారుడు.. వీడియో వైరల్
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన వివాహ కార్యక్రమంలో డొనాల్డ్ ట్రంప్ జూనియర్ సందడి చేశాడు. గ్రాండ్ సంగీత్‌లో బాలీవుడ్ హీరోలు రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ వంటి సినీ ప్రముఖులతో కలిసి స్టేజ్‌పై సందడి చేశారు. స్నేహితురాలు బెట్టినా ఆండర్సన్‌తో కలిసి ట్రంప్ జూనియర్ నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియన్-అమెరికన్ బిలియనీర్ కుమార్తె నేత్ర మంతెన వివాహం ఉదయపూర్‌లోని వంశీ గదిరాజుతో జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా మొదటి రోజు బాలీవుడ్ ప్రముఖులు రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, జాన్వీ కపూర్, కృతి సనన్ సంగీత్‌లో తళుకున మెరిశారు. రణ్‌వీర్ గల్లీ బాయ్ సినిమాలోని అప్నా టైమ్ ఆయేగా పాటను పాడి వివాహ వేదికను ఉత్సాహంగా మార్చాడు. ఉదయపూర్‌లో జరిగిన ఈ గ్రాండ్ వివాహానికి ప్రముఖులు, బిలియనీర్లు, అంతర్జాతీయ వీఐపీలు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భారతీయ కళాకారులు పాల్గొనగా.. జస్టిన్ బీబర్, జెన్నిఫర్ లోపెజ్ వంటి ప్రపంచ కళాకారులు కూడా హాజరయ్యారు.
విషాదం.. ట్రాక్టర్ రివర్స్ తీసుకుంటుంగా ప్రమాదం.. నాలుగేళ్ల చిన్నారి…
జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా.. జరిగిన ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి అక్కడికిక్కడే చనిపోయాడు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. గద్వాల జిల్లాలోని మానవపాడులో విషాదం చోటుచేసుకుంది. విష్ణుకుమార్-పార్వతమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో చిన్న కుమారుడు కార్తీక్ నాయుడు.. అక్కడే ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు. అయితే బీసీ కాలనీలోకి వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ అక్కడికి చేరుకుంది. డ్రైవర్ ట్రాక్టర్ ని రివర్స్ చేస్తున్న క్రమంలో ఆడుకుంటున్న కార్తీక్ నాయుడిని బలంగా తాకింది. దీంతో బాలుడు అక్కడికిక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఏరియా ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి విష్ణు కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. ఈ విషయంపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
‘చికిరి’ పాటకు టీడీపీ నాయకుడి స్టెప్పులు.. దర్శకుడు బుచ్చిబాబు రీట్వీట్!
‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఇటీవల ‘చికిరి’ అనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాట రిలీజ్ రోజు నుంచే డిజిటల్ మీడియాను కబ్జా చేసేసింది. రామ్ చరణ్ హుక్ స్టెప్, జాన్వీ కపూర్ గ్లామర్ పాటలో హైలెట్ కాగా.. రీల్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎంతలా అంటే.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరు ఈ పాటకు చిందులేస్తున్నారు. సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ కూడా చికిరి అంటూ స్టెప్పులేస్తున్నారు. తాజాగా కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు పంతగాని నరసింహ ప్రసాద్ కూడా చికిరి పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో.. పెద్ది దర్శకుడు బుచ్చిబాబు రీట్వీట్ చేయడం మరింత వైరల్‌గా మారింది. ప్రస్తుతానికైతే అందరూ చికిరి వైబ్‌లోనే ఉన్నారని చెప్పాలి. ఇప్పటికే ఈ పాట యూట్యూబ్‌లో అన్ని భాషల్లో కలిపి 90 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి 100 మిలియన్స్ దిశగా దూసుకుపోతోంది. 1.5 మిలియన్ లైక్స్‌తో దుమ్ముదులిపేస్తోంది.
జనసేన కమిటీలపై పవన్ ఫోకస్.. కమిటీల నిర్మాణం, కూర్పుపై దిశా నిర్దేశం..
జనసేన పార్టీ కమిటీల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ వేగం పెంచింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్మాణం, నాయకత్వం బలోపేతంపై జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టారు.. ఈ రోజు ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమైన పవన్.. పార్టీ బలోపేతంపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీల నిర్మాణం, వాటి కూర్పుపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ కేంద్ర బృందం ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి శ్రేణులు, వీరమహిళలతో సమావేశాలు నిర్వహిస్తోంది. వారితో చర్చించి సూచనలు, అభిప్రాయాలు నమోదు చేస్తోంది. రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలపై ప్రజాభిప్రాయాలు కూడా సేకరిస్తోంది. ఈ నివేదికలను పవన్ కల్యాణ్ స్వయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
బెంగళూరులో రూ.7 కోట్ల దోపిడీ.. నిందితులు అరెస్ట్
బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ATM క్యాష్ వ్యాన్ దోపిడీని ఛేదించారు. ఈ దోపిడీలో రూ.7 కోట్లకు పైగా నగదును దోచుకున్నారు. తాజాగా బెంగళూరు పోలీసులు ఈ దోపిడీలో క్యాష్ వ్యాన్ ఇన్‌ఛార్జ్, ఒక పోలీస్ కానిస్టేబుల్, CMS కంపెనీ మాజీ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నట్లు శనివారం పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులు ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.5.76 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నవంబర్ 19న, ఆర్‌బిఐ అధికారులుగా నటిస్తూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ ఒక ఎటిఎం క్యాష్ వ్యాన్‌ను ఆపి సుమారు రూ.7 కోట్లతో పారిపోయారని పోలీసులు తెలిపారు. జెపి నగర్‌లోని ఒక బ్యాంకు శాఖ నుంచి సిఎంఎస్ ఇన్ఫో సిస్టమ్ వాహనం నగదును రవాణా చేస్తుండగా ఈ దోపిడి జరిగింది. నిందితులు భారత ప్రభుత్వ స్టిక్కర్ ఉన్న కారులో వచ్చి, పత్రాలను ధృవీకరించాలని చెప్పి వ్యాన్‌ను ఆపి, నగదుతో పాటు సిబ్బందిని బలవంతంగా తమ వాహనంలోకి ఎక్కించారు.
మావోయిస్టులకు మరో దెబ్బ.. కీలక నేత సహా 37మంది లొంగుబాటు..
తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలపై ప్రభుత్వం నడుపుతున్న ఆపరేషన్లు మరోసారి పెద్ద ఫలితాన్ని సాధించాయి. మొత్తం 37 మంది మావోయిస్టులు డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా కీలక నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు సాంబయ్య అలియాస్ ఆజాద్ కూడా అధికారుల ముందుకు వచ్చాడు. ఏవోబీ (ఆంధ్ర–ఒడిశా సరిహద్దు) ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన ఆజాద్, గత కొంతకాలంగా భద్రతా దళాల నిఘాలోనే ఉన్నాడని పోలీసు అధికారులు వెల్లడించారు.
తిరుమల లడ్డూపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన వైవీ సుబ్బారెడ్డి
తిరుమల లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తాను.. విచారణ సరిగ్గా జరిగితే ఎప్పుడైనా హాజరుకావడానికి సిద్ధమే అన్నారు. శాస్త్రీయ ఆధారాలతో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ల్యాబ్ నివేదికలు రాక ముందే మీడియా లీకులు, రాజకీయ ప్రచారాలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని ఆరోపించారు. అసత్యాలు, వదంతులతో భక్తుల విశ్వాసాలను దెబ్బ తీయొద్దని కోరారు. చంద్రబాబే మొదటగా లడ్డూలో జంతు కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేశారు.. అప్పుడు సుప్రీం కోర్టును టీటీడీ ఆశ్రయించింది అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్లు.. ప్రతి పాఠశాలకి రూ. 200 కోట్లు..
ప్రపంచంలో పోటీపడే విధంగా మన బిడ్డలు ఎదగటం కోసమే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రతి స్కూలుకి 200 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 20 ఎకరాల ప్లాన్‌లో అత్యంత అద్భుతంగా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ స్థాయిలో నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. దేశంలోనే ఇటువంటి స్కూల్స్ ఏ రాష్ట్రంలో కూడా నిర్మించడం లేదన్నారు. క్వాలిటీకి ఎక్కడ కొరతలేదని చెప్పారు.. గత 15లో రెసిడెన్షియల్ స్కూల్ అని బీఆర్ఎస్ గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది.. పోషకాహారం లేని భోజనాన్ని అందించింది.. ఆనాడు అరకొరగా పనికిరాని చీరలు గత ప్రభుత్వం ఇచ్చిందని ఆరోపించారు. కట్టు కోవడానికి పనికి వచ్చేటువంటి చీరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.