Rajasaab Song Promo : డార్లింగ్ ఫ్యాన్స్‌కి, మాస్ ఆడియన్స్‌కి ఒక సూపర్ ట్రీట్ అందించేందుకు రెబల్ స్టార్ ప్రభాస్ రెడీ అయ్యారు. ఈసారి డైరెక్టర్ మారుతితో కలిసి చేస్తున్న హారర్-కామెడీ ఎంటర్‌టైనర్ ‘రాజాసాబ్’ సినిమాపై ఎప్పటి నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా రేంజ్‌ను, ప్రభాస్ కొత్త లుక్‌ను, క్యారెక్టరైజేషన్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేసింది. ఆ అంచనాలను పదింతలు పెంచేలా మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ‘రెబల్ సాబ్’ ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రెబల్ స్టార్ లుక్స్ అదిరిపోయాయి. సాధారణంగానే మ్యూజిక్‌తో థియేటర్లను షేక్ చేసే థమన్, ఈసారి ‘రెబల్ సాబ్’ పాటకి ఇచ్చిన మ్యూజిక్, బీట్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.
ఈ ప్రోమో చూసిన అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ ట్రెండింగ్‌తో అంచనాలను ఆకాశానికి తీసుకెళ్తున్నారు. ఈ ఎనర్జిటిక్ ఫుల్ సాంగ్‌ను రేపు (ఆదివారం) సాయంత్రం సరిగ్గా 6 గంటల 11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ ఫెస్టివల్ సీజన్‌లో రాజాసాబ్ బాక్సాఫీస్‌పై కచ్చితంగా తన మార్క్ చూపిస్తాడని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఈ పాట విడుదల తర్వాత సినిమాపై హైప్ మరింత పెరుగుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Mistakes do happen in excitement 😜#REBELSAAB will be out tomorrow at 6:11PM 😀🔥#TheRajaSaab #Prabhas https://t.co/6XmNwlkG2R
— The RajaSaab (@rajasaabmovie) November 22, 2025