నిన్న మొన్నటిదాకా దూకుడుగా ఉన్న ఆ ఎమ్మెల్యే ఉన్నట్టుండి మౌన వ్రతం పట్టారట. అనుచరుల్ని సైతం ష్….గప్‌చుప్ అంటున్నారట. సీఎంని, మాజీ సీఎంని ఓడించిన మొనగాడినంటూ… ఇన్నాళ్ళు రొమ్ము విరుచుకు తిరిగిన ఆ శాసనసభ్యుడు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యారు? వివాదాల జోలికి పోవద్దని అనుచరులకు ఎందుకు చెబుతున్నారు? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన సైలెన్స్ సంగతులు? అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు రాజకీయ గండరగండుల్ని ఓడించి.. కేవలం తెలంగాణలోనే కాదు… తెలుగు రాజకీయాల్లోనే సంచలనం అయ్యారు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే […]
హోంమంత్రిపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్.. రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతుంటే ఎందుకు స్పందించడం లేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు న్యాయం ఎందుకు చేయడం లేదని ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో ఉన్మాదులు, నేరస్థులు పేట్రేగిపోతున్నారన్నారు. గుంటూరులో నవీన్ అనే వ్యక్తి అమ్మాయిపై దాడి చేస్తే కనీసం పట్టించుకోలేదన్నారు. హోం మంత్రి , డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పోలీస్ వ్యవస్థను కక్ష్య సాధింపుకు వాడుతున్నారని, […]
ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ హిమాన్షు పాఠక్‌ను నియమిస్తున్నట్లు ఆ సంస్థ పాలక మండలి అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్‌లోని ICRISAT ప్రధాన కార్యాలయంలో అక్టోబర్ 18న జరిగిన ఆల్ స్టాఫ్ కార్యక్రమంలో పాలక మండలి చైర్ ప్రొఫెసర్ ప్రభు పింగళి ఈ విషయాన్ని ప్రకటించారు. డాక్టర్ పాఠక్ ప్రపంచ వ్యవసాయ పరిశోధన , అభివృద్ధిని అభివృద్ధి చేయడంలో విశిష్టమైన వృత్తిని కలిగి ఉన్నారు , ICRISATకి అనుభవ […]
అమృత్ మెడికల్ సైన్స్ కళాశాలలో ఒకేషనల్ పారామెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులు తమ సంస్థ రిజిస్ట్రేషన్ స్టేటస్‌పై ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. చదువు పూర్తయినా తమకు కోర్సు సర్టిఫికెట్లు అందలేదని విద్యార్థులు కళాశాల రిజిస్ట్రేషన్ చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తం చేశారు. నిరసన తెలుపుతున్న విద్యార్థుల ప్రకారం, సర్టిఫికేట్ల కోసం వారు పదేపదే చేసిన అభ్యర్థనలకు సమాధానం లభించలేదు, ఇది నిరాశకు దారితీసింది , వారి భవిష్యత్తు అవకాశాల గురించి అనిశ్చితికి దారితీసింది. కాలేజీ యాజమాన్యం […]
శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం… హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ లో ఉన్న ఈ ఆలయం ప్రముఖ, ప్రాచీన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరీ దేవీగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. దసరా, ఆషాడ మాసం వంటి పండుగలను ఈ ఆలయంలో అత్యంత భక్తితో నిర్వహిస్తారు. ఈ ఆలయం ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి ఎదురుగా ఉంది. ఫిల్మ్ నగర్ బస్ స్టాప్ నుండి నడిచి వెళ్లేంత దూరంలోనే ఉంటుంది. అనేక మంది ప్రఖ్యాతులైన వ్యక్తులు, […]
ఈ నెల 23, 24వ తేదీల్లో మూసీ పరీవాహక ప్రాంతంలో 9 టీమ్ లు పర్యటించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. 18 ప్రాంతాల్లో ఎంపీ, ఎమ్మెల్యేల బృందాలు పర్యటిస్తాయని ఆయన తెలిపారు. అక్కడ ప్రజలకి భరోసా కల్పిస్తాయని, ఈ నెల 25న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. హై కమాండ్‌కు కప్పం కట్టేందుకు ప్రతినెలా ఎత్తులు వేస్తున్నారు రేవంత్ రెడ్డి అని […]
నుడా చైర్మన్ అభినందన సభలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హయం సువర్ణ మయం కాబోతుందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ ఇంట్లో నియామకాలు చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏం చేశారని కేంద్ర మంత్రులు రోడ్లు ఎక్కి ఆందోళన చేస్తున్నారని ఆయన అన్నారు. నిరుద్యోగులకు అన్యాయం జరగనివ్వమని, ఉనికి కోసం బి.అర్.ఎస్. గ్రూప్ _1 అభ్యర్థులను రెచ్చగొట్టిందన్నారు […]
రికార్డు ధరకు రాజా సాబ్ ఆడియో రైట్స్.. ఏడాదికి ఒక సినిమా రిలీజ్ ఉండేలా ప్లానింగ్ చేస్తున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ ఏడాది కల్కి తో సూపర్ హిట్ అందున్నాడు. ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. వాటిలో ఒకటి మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ లో హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో ఈ చిత్రం రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్న […]
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థల ద్వారా 18,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మోపేందుకు రంగం సిద్ధం చేసిందన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. వివిధ మార్గాల్లో ప్రజలపై విద్యుత్ భారం మోపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. గృహ అవసరాలకు నెలకు 300 యూనిట్లు దాటితే ఫిక్స్డ్ ఛార్జ్ ఐదు రెట్లు పెంచాలని భావిస్తోందని, పది రూపాయలు ఉన్న ఛార్జీని 50 రూపాయలు చేయాలని భావిస్తోందన్నారు. ఇళ్ళల్లో […]
నిజామాబాద్ జిల్లాలో నుడా చైర్మన్ కేశ వేణు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహా దారులు షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతూ.. గ్రూప్ వన్ పరీక్షల విషయంలో బీఆర్ఎస్ విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రతిష్టను మాసకబార్చే ప్రయత్నం చేసారు.. కానీ పరీక్షలకు అనుమతి లభించిందన్నారు మంత్రి జూపల్లి. సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని, కాంగ్రెస్ […]