అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు..
గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేయడంతో.. భారత్ లో రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మదహబి పురి బుచ్‌ను సైతం ఈ కేసులో ఎంక్వైరీ చేయాలన్నారు.
చితిపై నుంచి ఒక్కసారిగా పైకి లేచిన 65 ఏళ్ల వృద్ధురాలు.. అసలు ఏం జరిగింది?
తమిళనాడులోని తిరుచ్చిలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ ఇంట్లో నివసిస్తున్న 65 ఏళ్ల వృద్ధ మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణానంతరం ఆమె మృతదేహాన్ని దహన సంస్కారాల కోసం బుధవారం శ్మశానవాటికకు తీసుకెళ్లారు. ఆమె మృతదేహాన్ని చితిపై వేశాక ఆమె శరీరంలో కదలికలు వచ్చాయి. ఇది చూసి అందరూ భయపడ్డారు. అందరూ కొంత దూరం పరిగెత్తారు. అప్పుడు ఆ స్త్రీ లేచి నిలబడింది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. మహిళ సజీవంగా ఉండటంతో ఆమె కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.
పోలీసులపై చర్యలు తీసుకోండి.. హైకోర్టులో పట్నం శృతి పిటిషన్..
తెలంగాణలో లగచర్ల ఘటన సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇవాళ లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ నమోదు అయ్యింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారని సతీమణి పట్నం శృతి పిటిషన్ ధాఖలు చేశారు. దీనిపై పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పట్నం శృతి పిటిషన్ పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్టుచేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాట్టించలేదని పేర్కొన్నారు. డి.కె. బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శృతి పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి. సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ చేర్చారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. మరి దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
దారుణం.. డబ్బు కోసం కుమారుడిని చంపిన తల్లిదండ్రులు.. ఎక్కడంటే?
జార్ఖండ్‌లోని రాంచీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఇక్కడ డబ్బు కోసం తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేశారు. విషయం ఠాకూర్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పట్రాటు గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ ఓ యువకుడిని అతని తండ్రి, సవతి తల్లి కలిసి చంపేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. పట్రాటు గ్రామానికి చెందిన ఫులేశ్వర్ పహాన్, అతని మూడో భార్య సునీతాదేవి మద్యం తాగి తమ కుమారుడిని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. అతను డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో వారిద్దరూ తమ 25 ఏళ్ల కుమారుడు మదన్ పహాన్ తలపై గుడ్డ కప్పి పిస్టల్‌లో కాల్చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు పాల్పడిన తర్వాత నిందితులిద్దరూ పరారయ్యారు.
ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్‌గా వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్
ఏపీ అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పదవికి వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్‌ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అసెంబ్లీలో మూడు కమిటీలకు వైసీపీ తరఫున నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ సంస్థల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అంచనాల కమిటీ ఛైర్మన్ పదవికి వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ వేశారు. అంతకు ముందు నామినేషన్ వేయడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ అధికారులు రెండు గంటల పాటు ఎదురుచూసేలా చేశారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి విద్య, వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు
మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడి సంవత్సరం కావస్తుందని, 300కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం మహారాష్ట్రతో పాటు జిల్లాకు మెరుగైన వైద్యం అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి విద్య వైదానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, గత ప్రభుత్వాలు హమేల కే పరిమితం అయ్యారని, నిర్మాణం తో పాటు వైద్య సిబ్బందిని కూడా నియమిస్తున్నామని ఆయన తెలిపారు. 200కోట్లతో కరకట్టల నిర్మాణం చేస్తున్నాం మరో 40కోట్లతో విద్య కు కేటాయించామని ఆయన వెల్లడించారు. నియోజక వర్గానికి 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు ప్రేమ్ సాగర్ రావు అని, మంచిర్యాల పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. ఇంటి గ్రేటెడ్ పాఠశాల తీసుకువచ్చి న ఘనత మీ ఎమ్మెల్యేది అని, బీఆర్‌శ్రీస్, బీజేపీ పార్టీలు పదేళ్ల కాలం ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు , దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కేవలం నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకుంటుందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకం.. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం..
రాష్ట్రంలో శాంతి భద్రతలే కీలకమని.. టూరిజం డెవలప్ కావాలంటే శాంతి భద్రతలు పటిష్టంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. నాలెడ్జ్ ఎకానమీకి ఏపీ చిరునామా కావాలంటే శాంతిభద్రతలు చాలా ముఖ్యమన్నారు. పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామని.. చట్టాన్ని చేతికి తీసుకుని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఎవరైనా సరే శిక్షిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పోలీసు వ్యవస్థను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. 5 ఎకరాల భూమి అమరావతిలో పోలీసు మార్టియర్స్ డే కోసం ఇస్తామన్నారు. సైబర్ పోలీసు స్టేషనులు పెడుతున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు..ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ తుళ్ళూరులో పెడతామని చెప్పారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ఇక్కడకి తీసుకొస్తామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించింది
రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత ప్రయాణాలు, ఇందిరమ్మ ఇళ్ల పథకం, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, 50 వేల ఉద్యోగాలు లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని ఆయన అన్నారు. ఈ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా ప్రజల్లోకి తీస్కెళ్లాలన్నారు మహేష్ గౌడ్. కాంగ్రెస్ కార్యకర్తలు మన ప్రభుత్వం చేసిన పనులను ఇంటింటికి తీసుకెళ్లాలన్నారు.
కరీంనగర్‌లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్
ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందన్నారు కేటీఆర్. 2009, నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టిఆర్ఎస్) అధ్యక్షులు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తిన ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందని, దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో – కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండవర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందన్నారు కేటీఆర్. ఈ దీక్ష యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని ఆయన వ్యాఖ్యానించారు.