HYDRA Volunteers : ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్ల సహకారం అందివ్వనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈక్రమంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు హైడ్రా వాలంటీర్లు. ట్రాఫిక్ రద్దీ, ఇతర […]
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో ఇంజనీరింగ్ , లా కాలేజీలకు మంజూరైనున్నట్లు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యాభివృద్ధి కోసం ఈ జిల్లాకు చాలా మేలు చేకూరుతుందని ఆయన అభిప్రాయపడుతున్నారు.
పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ లకు సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో విడుదల చేసింది. పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్‌ల బడ్జెట్‌గా రూ.182.48 కోట్లను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ.. ఆయుర్వేదం, యోగా మన వేద జ్ఞానం అని, ప్రకృతితో మమేకమై ఎలా జీవించాలో పూర్వీకులు మనకు నేర్పించారన్నారు. మనం దాన్ని కొనసాగించ లేకపోతున్నామని, యోగా, ఆయుర్వేదం మతానికి సంబంధించిన అంశాలు కాదన్నారు మంత్రి దామోదర.
గతవారం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఇప్పుడు అల్పపీడనంగా మారింది, కానీ ఈ అల్పపీడనం కూడా మరింత బలహీనపడి ఆవర్తనంగా మారిపోయింది. వాతావరణశాఖ అధికారులు ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
టపాసుల దుకాణ దారులు భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. అబిడ్స్ బొగ్గులకుంటలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదానికి గురైన క్రాకర్స్ దుకాణ ప్రాంతాన్ని పరిశీలించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ సందర్భంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన క్రాకర్స్ దుకాణాన్ని ఆ పక్కనే ఆహుతి అయిన టిఫిన్ సెంటర్‌ను పరిశీలించి ప్రమాదానికి కారణాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు ఏవీ రంగనాథ్.
మహిళా జర్నలిస్టుతో సీపీఎం నేత పాడుబుద్ధి.. ఎఫ్ఐఆర్ నమోదు ప్రజా సేవకుడు అంటే పది మందికి ఆదర్శంగా ఉండాలి. అలాంటిది వాళ్లే మర్యాద తప్పి ప్రవర్తిస్తున్నారు. తాజాగా పశ్చిమబెంగాల్లో ఓ సీపీఎం నాయకుడు పాడు బుద్ధి ప్రదర్శించాడు. ఇంటర్వ్యూకు వచ్చిన ఒక మహిళా జర్నలిస్టుతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదే విషయాన్ని మహిళా జర్నలిస్టు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. దీంతో సీపీఎం పార్టీ సీరియస్‌గా తీసుకుని సస్పెండ్ చేసింది. తాజాగా అతగాడిపై పోలీసులు కూడా కేసు నమోదు […]
ఏ కేటగిరిలోనూ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగా రావు వెల్లడించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 8 పిటిషన్లపై కమిషన్ తన అభిప్రాయాలను వెల్లడించిందని, అన్ని పిటిషన్ ల పై ఎలాంటి లాప్స్ లేకుండా వెల్లడించాలని నిర్ణయించిందన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో ఆయిల్ ఫామ్ పెద్ద ఎత్తున సాగుచేయడం కోసం మన రాష్ట్రం లో 31 జిల్లాలకు అనుమతులు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ తో పాటుగా 14 ప్రయివేటు కంపెనీలు పామాయిల్ విస్తరణ కు ముందుకొచ్చాయని, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఆయిల్ ఫెడ్ కేంద్రం ఉంటుందన్నారు.
రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా గతంలో పనిచేసిన అమోయ్ కుమార్ పై రంగారెడ్డి జిల్లా వట్టినపులపల్లిలోని... శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. 1983లో రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టి నాగులపల్లిలోని 460 ఎకరాల్లో... 3,333 ప్లాట్లను కొనుగోలు చేశామని అసోసియేషన్ సభ్యులు లక్ష్మీ కుమారి, కృష్ణారెడ్డి లు తెలిపారు.