బాపూఘాట్లో ప్రపంచంలోనే ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే ప్రకటించారు. బాపూఘాట్ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజీతో పాటు గాంధీ ఐడియాలజీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు.
రేవంత్, కేటీఆర్ మీరు ఇద్దరూ చేయాల్సింది పాదయాత్ర కాదు... మోకాళ్ల యాత్ర చేయండన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన కరీంనగర్ జిల్లా బెజ్జంకిలో మీడియాతో మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసే దమ్ముందా? గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన తప్పులను ఒప్పుకునే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు.
ఇవాళ సచివాలయంలో పంచాయతీరాజ్ గిరిజన అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. అందుకే ఎన్నడు లేని విధంగా హాస్టల్, గురుకుల విద్యార్థులకు డైట్ కాస్మోటిక్ 40% పెంచడం జరిగిందని, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యార్థులకు 40 శాతం చార్జీలను పెంచిన సీఎంకి ధన్యవాదాలు తెలిపారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వం దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ) ను 3.64 శాతం పెంచుతూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన డీఏ 2022 జులై 1వ తేదీ నుంచి అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. నవంబర్ జీతంతో పాటు ఈ పెరిగిన డీఏ చెల్లించనున్నారు. 2022 జులై 1 నుండి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ […]
Suspended : వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ ను సస్పెండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే..ప్రభు వినయ్ కుమార్ గత 4 నెలల నుంచి విధులకు హాజరు కాకుండా హాజరు రిజిస్టర్ , ఫైళ్లను ఇంటివద్దకే తెప్పించుకుని సంతకాలు చేస్తూ జీతం తీసుకుంటున్నాడని, సర్వీస్ రిజిస్టరులో పుట్టినతేదీ మార్చుకుని, చట్టవిరుద్ధంగా సర్వీస్ పొడిగించుకోవటంతో పాటు ..సీనియారిటీ లిస్టులో అక్రమాలకు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ప్రభు వినయ్ […]
ఆయుష్మాన్ భారత్‌పై కేజ్రీవాల్ విమర్శలు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రతిష్టాత్మకంగా ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5లక్షల వరకు ఉచిత వైద్యా్న్ని అందించనున్నారు. అయితే ఈ పథకం ప్రారంభించినప్పుడు ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్‌కు చెందిన వృద్ధులు క్షమించాలని కోరారు. రాజకీయ కారణాల చేత ఈ రెండు రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని పేర్కొన్నారు. తాజాగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై మాజీ […]
Diwali 2024 : దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్లు లేదా విద్యుత్ దీపాల కారణంగా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన , అగ్నిమాపక శాఖ రాష్ట్రవ్యాప్తంగా తన మొత్తం సిబ్బందిని అప్రమత్తం చేసింది. అగ్నిమాపక నియంత్రణ గదిలో పనిచేసే అధికారులు , స్టేషన్లలో పురుషుల సెలవులు రద్దు చేయబడ్డాయి , 24 గంటలూ అప్రమత్తంగా ఉంచబడ్డాయి. క్రాకర్లు కాల్చేటప్పుడు, దీపాలు లేదా కొవ్వొత్తులను వెలిగించేటప్పుడు , షార్ట్ సర్క్యూట్ల కారణంగా నివాస […]
Caste Enumeration : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల వివరాల సేకరణ కై ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే కోసం క్షేత్రస్థాయిలో విస్తృత ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అదిలాబాద్ జిల్లా జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఈ సందర్భంగా జైనద్ మండలం రైతువేధిక లో ఏర్పాటు చేసిన ఎన్యూమరెటర్లు, సూపర్వైజర్ ల శిక్షణా కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య […]
Balmuri Venkat : బీఆర్ఎస్ కి చెందిన ఓ ఆంబోతు ఏది పడితే అది మాట్లాడుతున్నాడంటూ ఎమ్మె్ల్సీ బల్మూరి వెంకట్ విమర్శలు గుప్పించారు. కొకైన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఎవరు.? పార్టీలో ఏం జరిగింది అనేది పక్కదారి పట్టిస్తున్నారని, 10 యేళ్ల నుండి కేటీఆర్ సన్నిహితులు డ్రగ్స్ వాడుతుంటారు కాబట్టి.. ఆయనకు కూడా అలవాటు ఉందని ఆరోపణలు వచ్చాయన్నారు. విజయ్ మద్దూరు చానా దగ్గర వ్యక్తులు అని కేటీఆర్ అంటున్నాడని, నీ సన్నిహితులు కొకైన్ తీసుకుంటే దాని […]