తెలంగాణలో గ్రూప్-3 అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కీలక అప్డేట్ అందించింది. నవంబర్ 17 , 18 తేదీల్లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను కమిషన్ విడుదల చేసింది. పరీక్షలకు వారం రోజుల ముందు హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
సోనియాగాంధీ రాహుల్ గాంధీ ఖర్గే అగ్రనేతలందరూ మాట ఇచినట్టే కుల గణన చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ సామాజిక వర్గం ఎంత ఉన్నారో నిష్పత్తి ప్రకారం వివరాలు నమోదు చేస్తున్నామని, నవంబర్ 31 లోగా కులగణన ను రేవంత్ రెడ్డి చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. కులగణన దామాషా ప్రకారమే రాజకీయ పదవులు కూడా అందుబాటులో ఉంటాయని, కేటీఆర్ హరీష్ రావు ప్రతి అంశం పట్ల రాజకీయం చేస్తున్నారన్నారు. రాజకీయ […]
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) త్వరలో వరంగల్ ప్రాంతంలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. హైదరాబాద్, నిజామాబాద్, ఏటూరునాగారం, మంగపేట, ఖమ్మం, భూపాలపల్లి రూట్లలో 82 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు టీజీఆర్టీసీ అధికారులు తెలిపారు.
Mahesh Kumar Goud : రాహుల్ గాంధీ ఈ దేశానికి ఫ్యూచర్ అని, ఎవరు ఎంత మందో.. వారికి అంత వాటా అని తేల్చాలని రాహూల్ గాంధీ ఆలోచన అని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కుల గణన నిస్పక్ష పాతంగా నిర్వహిస్తామని, రాహుల్ గాంధీని పిలిచాం వస్తా అన్నారని ఆయన తెలిపారు. నవంబర్ 5 లేదంటే 6 వ తేది రాహుల్ గాంధీని పిలుస్తామని మహేష్ గౌడ్ తెలిపారు. హైకోర్టు సరిదిద్దుకోండి అంటే సరిదిద్దుకుంటామని, […]
ఇవాళ మీడియాతో మాజీమంత్రి హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి భాష చూసి పిల్లలు చెడిపోతారు అని.. టీవీ లు ఆపేస్తున్నారని, హైదరాబాద్ లో సముద్రం, బకారానంగళ్ ప్రాజెక్టు తెలంగాణ లో ఉంది అనే లాంటి మాటలు చెబుతున్నారన్నారు.
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఒక్క ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకుండా భర్తీ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్యంగా పెట్టుకున్నారు అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు. రోజ్ గార్ మేళా ద్వారా ఇప్పటి వరకు 8.50 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం బషీర్ బాగ్లో భారతీయ విద్యా భవన్లో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా […]
ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల పలు సమీక్షలను నిర్వహించారు. సోమవారం మేధావులతో సమావేశమై అభిప్రాయాలను స్వీకరించారు. మంగళవారం సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వివరాలను సేకరించడంపై దృష్టి పెట్టాలని డిప్యూటీ సీఎం సూచించారు.
ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది.. తిరుపతికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఇక, 140 రోజుల్లో ముఖ్యమంత్రి ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.. ప్రతి పేద వాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే, ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తోంది అని వ్యాఖ్యానించారు. రాబోయే 2, 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అభివృధ్ది చేస్తాం.. అభివృధ్ది,సంక్షేమం రెండు కళ్ళ లాంటివని […]