Sajjala Bhargav : ఏపీ హైకోర్టులో వైసీపీ సోషల్ మీడియా నేతలు సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేపట్టింది. మొత్తం 8 కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని సజ్జల భార్గవ్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.. అయితే… అన్ని పిటిషన్లపై నేడు విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. వైసీపీ సోషల్ మీడియా వింగ్ నేత సజ్జల భార్గవ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఆయన తరఫున వాదనలు పూర్తి చేశారు. ఏపీలో పోలీసులు రూలింగ్ పార్టీ ఒత్తిడికి ప్రభావితం అవుతున్నారని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. వెంటాడి వరుసగా అక్రమ కేసులను పెట్టి ఇబ్బంది పెడుతున్నట్టు పిటిషనర్ తరుపు లాయర్ హైకోర్టు తెలిపారు. అంతేకాకుండా.. ఒక పోస్ట్ పెడితే శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు రాష్ట్రమంతా కేసులు పెడుతున్నారన్న పిటిషనర్ తరుపు లాయర్ న్యాయస్థానానికి వివరించారు.
V. Hanumantha Rao: వి.హనుమంతరావు కారును ఢీ కొట్టిన మరో వాహనం.. సీసీ ఫుటేజ్ లో దృశ్యాలు..
వందల సంఖ్యలో కేసులు పెట్టడం వల్ల అనేక మంది ఇబ్బందులు పెడుతున్నారని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలు కూడా పక్కన పెడుతున్నారని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు. ప్రస్తుతం 9 కేసులు ఉంటే అవి 90కి మించి పెరిగేలా కేసులు నమోదు ప్రక్రియ ఉందని, ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ హక్కులను కూడా కాలరాసి అక్రమ కేసులు పెట్టారని పిటిషనర్ తరుపు లాయర్ వాదించారు. ఇదిలా ఉంటే.. కేసుల నమోదులో ప్రాథమికంగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టు తెలిపారు. ఆధారాలు సేకరించి కేసులు నమోదు చేసినట్లు.. అసభ్య పోస్టులు పెట్టిన వారు ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా కూడా కేసులు నమోదు చేసినట్టు ప్రభుత్వం తరుపు లాయర్ వివరించారు. ఇలాంటి అన్ని కేసుల పిటిషన్లు ఈ నెల 29 విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.
Nirmal: నిర్మల్ లో ఉద్రిక్తత.. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..