Group 2 : గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్టేడ్ ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులు డిసెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది టీజీపీఎస్సీ. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. కాగా, 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయగా.. 5.51లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. […]
భార్య జీవితానికి సహచరురాలే కాదు, గమ్యానికి ప్రేరణ కూడా. ఆమె ప్రేమ, అనురాగం, బంధం భర్త జీవితాన్ని మరింత విలువైనదిగా మారుస్తాయి. భార్య అంటే కేవలం ఒక పాత్ర కాదు.. ఆమె భర్త ఆనందానికి మూలం, భర్త బాధలను తగ్గించే ఓదార్పు, ప్రతి విజయానికి వెనుక ఉన్న అండగా నిలిచే వ్యక్తి. ఆమె తోడు ఒక కుటుంబాన్ని మాత్రమే కాకుండా, ఒక సంతోషకరమైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది.
అమెరికాలోనూ అదానీ అక్రమాలకు పాల్పడ్డారు.. గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు అయింది. న్యూయార్క్ జడ్జి తన ఆదేశాల్లో అరెస్టు వారెంట్ జారీ చేయడంతో.. భారత్ లో రాజకీయంగా తీవ్ర వివాదం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. గౌతమ్ అదానీ.. భారతీయ, అమెరికా చట్టాలను ఉల్లంఘించినట్లు తెలుస్తుందన్నారు. మోడీ, అదానీ కలిసి ఉంటే.. ఆ ఇద్దరూ ఇండియాలో క్షేమంగా ఉంటారని ఆయన ఆరోపించారు. అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని […]
KTR : ఈనెల 29వ తేదీన కరీంనగర్ లో జరిగే దీక్ష దివాస్ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్ ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తుందన్నారు కేటీఆర్. 2009, నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి […]
TPCC Mahesh Goud : రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మనం చేసి చూపించామన్నారు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేయలేని అనేక పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేబినెట్ మంత్రులు చేసి చూపించారని ఆయన వ్యాఖ్యానించారు. 18 వేల కోట్ల వ్యవసాయ రుణాలు, ఆర్టీసీ ఉచిత […]
Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కేంద్రంలోని బీజేపీ పెద్దలపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ రంగ సంస్థలు , దేశ సంపదను అదానీకి అప్పగిస్తున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకు కేవలం నిబంధనల మేరకు ఒప్పందాలు చేసుకుంటుందని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రావడానికి ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. Zomato: జీతం […]
మంచిర్యాల జిల్లాకు 600 బెడ్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ హాస్పిటల్ భవన నిర్మాణ పనులకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేస్తారు.
Mallu Ravi : కాంగ్రెస్ నేత, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కేటీఆర్ ఢిల్లీలో డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గిరిజనుల కోసం పదేళ్ల పాలనలో ఏమి చేశారని ప్రశ్నించారు. లగచర్లలో ప్రజలు, రైతులను రెచ్చగొట్టింది కేటీఆర్ కాదా? అని ఆరోపించారు. గొడవలకు కారణం కేటీఆర్ అని తేలడంతో, నూతన డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. రైతుల ముసుగులో బీఆర్ఎస్ […]
అతి సర్వత్రా… అన్నది ఆ ఎమ్మెల్సీ విషయంలో ప్రాక్టికల్‌గా నిరూపితం అవుతోందా? ఓ పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం అవుతోందా? తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పవర్ పోయాక మరో రూపంలో దూకుడు ప్రదర్శించి జనం నోళ్ళలో విపరీతంగా నానుతున్న ఆ లీడర్‌కు ఇప్పుడు సొంత పార్టీవాళ్ళే సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? ఎవరా ఎమ్మెల్సీ? ఏంటాయన జిల్ జిల్ కీ కహానీ? సిక్కోలు పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ది డిఫరెంట్ స్టైల్. […]
Bribe : పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం ఎమ్మార్వో ఉయ్యాల రమేష్, ఆర్ ఐ శ్రీధర్ లు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇటీవల రామగుండం కు చెందిన ఆలకుంట మహేష్ తన ఇసుక ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకొని ఎమ్మార్వో కు అప్పగించారు. అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్నావని ఎమ్మార్వో ట్రాక్టర్ ను సీజ్ చేశారు. ఆ ట్రాక్టర్ ను రిలీజ్ చేయాలంటే 25 వేల డీడి తో పాటు అదనంగా డబ్బులు […]