CM Revanth Reddy : కామన్ వెల్త్ మెడ్-ఆర్బ్ కాన్ఫరెన్స్- 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త కార్యక్రమాలతో టెక్నాలజీలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతోందని, సాఫ్ట్వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ మరియు బయో-టెక్నాలజీ పరిశ్రమలకు పవర్ హబ్‌గా హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. న్యాయవ్యవస్థ మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, కానీ, భారీ సంఖ్యలో కేసులు పెండింగ్‌లో […]
చితిపై తగలబడుతుండగా స్పృహ.. ఒక్కసారిగా లేచిన యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..! రాజస్థాన్‌లో ఘోర అమానుష ఘటన చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయేది. పోలీసుల అప్రమత్తతతో యువకుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఈ ఘటన జుంజును జిల్లాలో చోటుచేసుకుంది. రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో 25 ఏళ్ల చెవిటి, మూగ యువకుడు రోహితాష్ కుమార్ అనాథగా ఉంటున్నాడు. కుటుంబం లేకపోవడంతో ఒక షెల్టర్ హోమ్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి ఆరోగ్యం బాగోలేకపోతే స్థానిక […]
అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వే దేశంలోనే ఆదర్శంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం నాటికి మరో కీలక మైలు రాయి దాటింది.
స్త్రీ గొప్పతనం అనేది అంతటా ఒక అనువర్తనం, అనుభవం, మానవత్వం యొక్క ప్రతీక. స్త్రీలు తమ జీవన కాలంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కొంటూ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన ప్రతికూలతలను దాటుకొని అగ్రతలపై ఎదుగుతూ వస్తున్నారు. వారివి నిజంగా అద్భుతమైన జీవన కథలు.
Agriculture Market Committee : రాష్ట్రవ్యాప్తంగా 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలకవర్గాలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకాలను మంత్రి తుమ్మల శుక్రవారం ప్రకటించారు. కొత్తగా నియమించబడిన మార్కెట్ కమిటీలు – షాద్ నగర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గాఎ. సులోచన, వైస్ చైర్ పర్సన్ మహ్మద్ అలీఖాన్ నియామకం. హుస్నాబాద్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీకి చైర్ పర్సన్ గా కంది తిరుపతిరెడ్డిని, వైస్ చైర్ పర్సన్ […]
హైడ్రా బ్రెయిన్ స్టోర్మ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. ఎఫ్టీఎల్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి చెరువులు పరిరక్షించడం హైడ్రా ఉద్దేశం కాదన్నారు. చెరువులను పునరుద్దరించాలంటే ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. తమ కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్య రహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఉక్కిరిబిక్కిరైన ప్రజలు దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు (శుక్రవారం) ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టమైన పొగమంచు పూర్తిగా కమ్మేసింది. అలాగే, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 373గా రికార్ట్ అయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలో మొత్తం 38 మానిటరింగ్ స్టేషన్లలో తొమ్మిదింటిలో ఏక్యూఐ లెవల్స్ తీవ్రమైన కేటగిరీలో […]
మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధనికుడు.. పేదలు మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ వల్లనే అదానీ దురాగతాలకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ , వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హత పైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు ఆది శ్రీనివాస్.