Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gautam Gambhir: గువాహటిలోని బర్సపారా స్టేడియంలో సెప్టెంబర్ 30న జరిగిన మ్యాచ్ మామూలుగా లేదు. బౌలర్లను బ్యాటర్లు ఆటాడుకున్నారు. సిమెంట్ రోడ్డులా ఉన్న ఆ ఫ్లాట్ పిచ్‌పై బ్యాటర్లు పరుగుల వర్షం కురిపించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు తమ వన్డే చరిత్రలోనే అత్యధికంగా 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంత పెద్ద టార్గెట్‌ను కూడా భారత జట్టు కేవలం 39 బంతులు మిగిలి ఉండగానే చాలా ఈజీగా ఛేజ్ చేసి, తమ వన్డే హిస్టరీలోనే అతిపెద్ద రన్ ఛేజ్‌ను నమోదు చేసింది. ఇక, ఈ మ్యాచ్‌పై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదో చెత్త మ్యాచ్ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత ఆఫీషియల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌లో పార్థివ్ పటేల్‌తో మాట్లాడిన గంభీర్.. ఇదసలు క్రికెట్ కాదని, ఒక రకమైన హాస్యాస్పదమైన విషయమని తీవ్రంగా స్పందించారు. బ్యాట్‌కు, బాల్‌కు మధ్య సరైన పోటీ ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇలాంటి మ్యాచ్‌లు టీవీ బ్రాడ్కాస్టర్లకు, కొత్త రికార్డులకు, ఆఖరికి ఫ్యాన్స్ వినోదానికి బాగుండొచ్చేమో కానీ, అసలైన క్రికెట్‌కి మాత్రం ఎంతమాత్రం మంచిది కాదన్నారు. మైదానంలో బ్యాటింగ్, బౌలింగ్ మధ్య సమతుల్యత ఉండాలని, బౌలర్ల గురించి కూడా ఆలోచించి వారికి కొంతైనా సహకారం అందించేలా పిచ్‌లు తయారు చేయాలని అభిప్రాయపడ్డారు. ఇలాంటి రోడ్డు లాంటి పిచ్‌లు మ్యాచ్‌ను పూర్తిగా ఒకే వైపు తిప్పేస్తాయని, ఇది క్రికెట్ పోటీతత్వానికే చాలా ప్రమాదకరమని గంభీర్ స్పష్టం చేశారు.
Also Read
- Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
- IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
- Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
- Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
మరోవైపు సోషల్ మీడియాలో కూడా క్రికెట్ అభిమానులు ఈ పిచ్ తీరుపై విపరీతంగా మండిపడుతున్నారు. అసలు గువాహటి లాంటి చోట్ల ముఖ్యమైన మ్యాచ్‌లు ఎలా కేటాయిస్తారంటూ ఒక అభిమాని సోషల్ మీడియాలో నిలదీశాడు. ఇక్కడ వన్డే పిచ్‌లతో పాటు టెస్టు పిచ్‌లు కూడా చాలా చెత్తగా ఉంటాయని, మైదానం సరిగ్గా లేకపోవడంతో పాటు లైటింగ్ సమస్యలు, పాన్ బహార్ ప్రకటనల గోల.. ఇలా ప్రతీదీ చాలా అసహ్యంగా ఉందంటూ కామెంట్ చేశారు. నిజానికి ఫ్యాన్స్, క్రికెట్ నిపుణులు పడుతున్న ఈ కోపంలో ఎంతమాత్రం తప్పులేదు. మ్యాచ్‌ల షెడ్యూల్, పిచ్‌ల తయారీ, జట్టు ఎంపిక లాంటి ప్రతి నిర్ణయం కేవలం డబ్బులు, వ్యాపారాల చుట్టూనే తిరిగితే అసలైన ఆట కనుమరుగైపోతుంది. నిన్నటి గువాహటి కావచ్చు లేదా మొన్నటి తిరువనంతపురం కావచ్చు.. రెండింట్లోనూ బౌలర్లు పూర్తి నిస్సహాయులుగా మిగిలిపోయారు. ఇలాంటి భారీ స్కోర్ల పిచ్‌లు కేవలం పరుగుల రికార్డులకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప, రాబోయే ప్రపంచకప్ టోర్నీకి నాణ్యమైన తయారీకి మాత్రం ఎంతమాత్రం ఉపయోగపడవు.
తాజావార్తలు
-
Ind vs Zim : జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్..
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..