హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్..
హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ పట్టుబడ్డాయి.1లక్ష 80 వేల ట్యాబ్లెట్స్ ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా, పరారీలో మరొకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్ప్రాజోలం కేసులో ముగ్గురిపై ఎక్సైజ్ పోలీసులు కేసునమోదు చేశారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ.. ‘నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ సప్లై చేస్తున్న ముఠా ను అరెస్ట్ చేశాము..1.8 లక్షల ఆల్ఫా జోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నాం.. స్వాధీనం చేసుకున్న ట్యాబ్లెట్స్ విలువ 9 లక్షలు ఉంటుందని తెలిపారు.
డీఈఈ సెట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన డీఈఈసెట్ ఫలితాలు జూన్ 5న విడుదలయ్యాయి. 2025 – 27 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు మే 25న ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్ష ఫలితాలను అధికారులు గురువారం విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షకు 77.54% మంది విద్యార్థులు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు. 43,615 మంది దరఖాస్తు చేయగా 33,821 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 26 వేల 442 మంది విద్యార్థులు అర్హత సాధించారు. 78.18 శాతం అభ్యర్థులు అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.
పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఏపీ ఆదర్శంగా నిలవాలి..
అడవులు, పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. దేశానికి ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రాజధాని ప్రాంతం అనంతవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం – వనమహోత్సవం కార్యక్రమం ప్రారంభం అయింది. సభ ప్రాంగణంలో ఏర్పాటైన స్టాళ్లను పరిశీలించారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. కొంతమంది మంత్రులు, అధికారులు కూడా పరిశీలించారు… ఇక, స్టాల్స్ వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు.. పర్యావరణ దినోత్సవానికి గుర్తుగా మొక్కలు నాటారు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. నల్లమల అడవుల పరిరక్షణకు జీవితం అంకితం చేసిన వ్యక్తి అంకారావు అని గుర్తుచేశారు.. అడవుల పర్యావరణ రక్షణ అందరి బాధ్యత.. 1000 మంది విద్యార్థులతో మొక్కలు నాటాం.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పినట్టు ఈ ఏడాది కోటి మొక్కలు నాటాలని లక్ష్యంతో ఉన్నామని తెలిపారు..
250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్‌ది..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అమలైన హరిత హారం కార్యక్రమం రాష్ట్రంలో హరిత విప్లవాన్ని సృష్టించిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో గ్రీన్ కవర్ 24% నుంచి 31%కి పెరిగిందని.. అంటే 7.7% వృద్ధిని సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మొత్తం 250 కోట్ల మొక్కలు నాటి, రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చిన ఘనత కేసీఆర్ దని కొనియాడారు. తాము మేం కేవలం ఆకుపచ్చని తెలంగాణ గురించి మాట్లాడలేదని.. కలను సాకారం చేశామన్నారు.
సెక్రటేరియట్‌లోని కళ్ళు తిరిగి పడిపోయిన మంత్రి కొండా సురేఖ..
తెలంగాణ సచివాలయంలోని కేబినెట్ హాల్ వద్ద గురువారం ఉదయం కీలక సంఘటన చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖ కళ్ళు తిరిగి పడిపోవడంతో అక్కడ ఉన్నవారంతా కాసేపు ఆందోళనకు లోనయ్యారు. అప్పటికే మంత్రివర్గ సమావేశం ప్రారంభమవుతున్న సమయంలో ఈ ఘటన జరగడం గమనార్హం. వెంటనే అక్కడే హుటాహుటిన అక్కడకు చేరిన వైద్య బృందం ఆమెకు ప్రాథమిక వైద్యం అందించింది. మెడికల్ పరీక్షల అనంతరం వైద్యులు మంత్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రకటించారు. లో బీపీ కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు డాక్టర్లు తెలిపారు. తక్షణమే ఇంజెక్షన్ ఇచ్చి, కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని ఆమెకు సూచించారు. కేబినెట్ సమావేశానికి హాజరై ఉన్న సమయంలో ఈ తాత్కాలిక అస్వస్థత కలిగినప్పటికీ, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గా ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రి సురేఖకు తిరిగి పూర్తిస్థాయి విశ్రాంతి కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రకృతిని మనం కాపాడితే.. అదే మనల్ని కాపాడుతుంది
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కార్యాలయం తరఫున ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. “ప్రకృతిని మనం కాపాడితే, అదే మనల్ని కాపాడుతుంది” అని సీఎం స్పష్టంగా తెలిపారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం థీమ్ “ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ”గా ఉన్న నేపథ్యంలో, ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని, దానికి సంబంధించి ప్రతిజ్ఞ చేయాలని సీఎం కోరారు. సహజ వనరుల సంరక్షణకు ప్రతిసారీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, రాబోయే తరాల కోసం ఈ వనరులను నిలుపుదల చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు.
తొక్కిసలాట ఘటనపై హైకోర్టు సీరియస్.. ప్రభుత్వానికి నాలుగు ప్రశ్నలు..!
తొక్కిసలాట ఘటనపై సుమోటో కేసు నమోదు చేయాలని బెంగళూరు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించింది. మంగళవారం స్టేటస్ రిపోర్టును పరిశీలన చేస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తొక్కిస్లాట ఘటనపై బెంగళూరు హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ఘటనపై ప్రభుత్వానికి సంబంధించి వివరాలను అడ్వొకేట్ జనరల్ కోర్టుకు వివరించారు. రెండున్నర లక్షల మంది స్టేడియం వద్ద చేరుకున్నారని.. తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందారని.. 56 మంది గాయాలు, 15 మంది డిశ్చార్జ్ అయ్యారని కోర్టుకు తెలిపారు. భద్రతాపరంగా అన్ని పటిష్టమైన చర్యలు చేపట్టామని ఏజే కోర్టుకు వివరించారు. ఇంతటి భారీ స్థాయి కార్యక్రమాలు జరుగుతుంటే ఎందుకు భద్రతాపరమైన చర్యలు తీసుకోలేదని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నామని కానీ ఊహించని విధంగా ఘటన జరిగిందని అడ్వొకేట్ జనరల్ తెలిపారు.
బాచుపల్లిలో ట్రావెల్ బ్యాగ్ హత్య కేసు చేధించిన పోలీసులు..
హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు చివరికి ఈ కేసును చేధించారు. మే 23న ఓ యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘోరమైన ఘటన వెనక నేపాల్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. హత్యకు గురైన యువతి నేపాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆమె హైదరాబాద్ నగర శివారులోని బాచుపల్లిలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో పనిచేస్తూ జీవనం సాగించేది. అదే సెంటర్‌లో మరో వ్యక్తి విజయ్ కూడా పని చేస్తున్నాడు. ఇద్దరూ గత నెలలోనే నగరానికి వచ్చారు.
తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ పరిహారం.. ఎంతంటే?
18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పు నెగ్గిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవాల వేళ పెనువిషాదం చోటుచేసుకుంది. తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో సహా పలువురు ఇప్పటికే ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ యాజమాన్యం సైతం ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. అంతే కాకుండా.. తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఆర్సీబీ యాజమాన్యం పరిహారం ప్రకటించింది. మృతి చెందిన 11 మంది కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని పేర్కొంది.