KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఏసీబీ తరుఫున AG సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ తరుఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ దవే వాదనలు వినిపించారు. కేటీఆర్ పైన నమోదైన సెక్షన్లు అతనికి వర్తించవు లాయర్ సిద్ధార్థ్ దవే కోర్టుకు తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కోసం బదిలీ అయిన డబ్బు FEO కు చేరింది.. 55 కోట్ల బదిలీ లో […]
Uttam Kumar Reddy : నల్గొండ లోకసభ స్థానం పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులపై జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. 2024 లో అందరికీ మంచి చేశాము.. 2025లో కూడా అలానే చేస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, స్వతంత్ర భారతదేశంలో కులగనన చేయడం మొదటి సారి అని […]
VC Sajjanar : టీజీఆర్టీసీ ఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు. కొత్త సంవత్సరాన్ని శుభప్రదంగా, సురక్షితంగా ప్రారంభించేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన చేసిన ఆహ్వానం ప్రజల్లో చైతన్యాన్ని పెంచే విధంగా ఉంది. “కొత్త సంవత్సరం వేడుకలను మీ కుటుంబ సభ్యులతో మీ ఇళ్లలోనే జరుపుకోండి. ప్రమాదాల నుంచి దూరంగా, సంతోషకరంగా ఉండండి. గతంలో కొత్త సంవత్సరం వేడుకల పేరుతో […]
Komatireddy Venkat Reddy : నల్గొండ పార్లమెంట్ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్ట్ లపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ 4 లక్షల ఎకరాలకు నీళ్లిచే ప్రాజెక్ట్ అని, SLBC, బ్రాహ్మణవెళ్ళాంల నాకు ప్రథమ ప్రాధాన్యమన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే కాంట్రాక్టర్లు పనిచేయరని, కాంట్రాక్టర్ పని చేయకపోతే మంత్రి గారికి చెప్పాలన్నారు మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ ప్రజల దశబ్దాల కల SLBC […]
TG Assembly Sessions: సోమవారం తెలంగాణ అసెంబ్లీ మూడవ సమావేశం జరగనుంది. ఈ సమావేశాల కోసం ప్రభుత్వం ఎజెండాను విడుదల చేసింది. అసెంబ్లీ సెక్రటరీ వీ నరసింహా చార్యులు ప్రకటించిన ఎజెండా ప్రకారం, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలో ఏడు రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీచేశారు. Kandula Durgesh: కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన మన రాష్ట్రంలో ఆదరణ లేకపోవడం బాధాకరం.. […]
Robbery : హనుమకొండ నగరం పెద్దమ్మ గడ్డ సమీపంలోని కేసర్ గార్డెన్ రోడ్ నెంబర్ 5 లో ఘరానా దొంగలు కొత్తగా నిర్మాణంలో ఉన్న గృహాలను టార్గెట్ చేస్తూ ఇంటి యజమాని లేని సమయంలో వచ్చి ఎలక్ట్రిషన్, ప్లంబర్ వర్కర్లమని చెప్పి నూతన ఇంటిలో పని చేస్తున్న బిహారి వాళ్ళని నమ్మించి విలువైన సామాగ్రిని పట్టపగలే చోరీ చేశారు. సుమారు రూ. 30 నుండి నలభై వేల రూపాయల విలువ చేసే ఎలక్ట్రికల్, ప్లంబింగ్ కు సంబంధించిన […]
బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు 72,659 కోట్లు ప్రజా ప్రభుత్వం రైతు భరోసా ఇచ్చేందుకు కట్టుబడి ఉంది.. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట మేరకు ముందుకు వెళ్తామని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, దుదిల్ల శ్రీధర్ బాబు, […]
Etela Rajender : నేను బీజేపీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 140 కోట్ల ప్రజలున్న మన భారత దేశం ప్రశాంతంగా ఉండడానికి కారణం బీజేపీ, మన నాయకుడు మోదీ అని ప్రజలందరికీ అర్థం అయ్యిందన్నారు. తెలంగాణ లో హైదారాబాద్ చుట్టు గెలిచిన పార్టీ మనదని, GHMC ఎన్నికల్లో వికసించేది కూడా బీజేపీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికార పార్టీకి 40 […]
Harish Rao : రాష్ట్రంలో మహిళలు, మైనర్ బాలికలపై అఘాయిత్యాలు పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని, ప్రభుత్వ వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గత సంవత్సరంతో పోలిస్తే తెలంగాణలో నేరాల రేటు 22.5% పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94% పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసులు నమోదయ్యాయన్నారు. సగటున రోజుకు 8 కేసులు నమోదవుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఇందులో 82 మైనర్ బాలికలపై అఘాయిత్యాలు జరగడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. కాంగ్రెస్ […]
Numaish: హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రతి సంవత్సరం నిర్వహించే నుమాయిష్ (అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన) ఈ సంవత్సరం వాయిదా పడింది. సాధారణంగా జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన దాదాపు 46 రోజుల పాటు జరుగుతుంది. అయితే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప దినాల కారణంగా నుమాయిష్ రెండు రోజుల పాటు వాయిదా పడిందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నుమాయిష్ ప్రారంభం కానుంది. ప్రదర్శనకు […]