HYDRA : అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు సిద్ధమైన హైడ్రా..
- అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు సిద్ధమైన హైడ్రా
- రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు
- అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చే పనిలో హైడ్రా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : అమీన్‌పూర్ మున్సిపాలిటీలో సమగ్ర సర్వేకు హైడ్రా అధికారులు సిద్ధమయ్యారు. రహదారులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల కబ్జాలపై ఫిర్యాదులు అందడంతో.. అమీన్‌పూర్ మున్సిపాలిటీలో ఆక్రమణలపై నిగ్గు తేల్చే పనిలో పడ్డారు హైడ్రా అధికారులు తమ కాలనీలోని పార్కులు, రహదారులతో పాటు కొన్ని ప్లాట్లను పక్కనే ఉన్న గోల్డెన్ కీ వెంచర్స్ వాళ్లు ఆక్రమించారంటూ వెంకటరమణ కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నెంబర్ 152, 153 లో ఉన్న వెంకటరమణ కాలనీలో హైడ్రా సర్వే చేపట్టింది. పార్కులు, రహదారులు కబ్జాకు గురి అయినట్టు హైడ్రా నిర్ధారణ వచ్చింది. వెంకటరమణ కాలనీ లోకి చొరబడి గోల్డెన్ కీ వెంచర్స్ ఆక్రమణలకు పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణ వచ్చింది హైడ్రా. ఈ విషయంలో మరింత లోతైన సర్వే చేయించేందుకు హైడ్రా చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా, ఏడీ సర్వే జాయింట్ సర్వే చేసేందుకు హైడ్రా ప్రయత్నం చేస్తోంది.
Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?
Also Read
- Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్‌వర్క్‌పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని వెంకటరమణ కాలనీకి ఆనుకుని పలు కాలనీల నుంచి కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీంతో.. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో సమగ్ర సర్వే చేసేందుకు హైడ్రా సిద్ధమైంది. అందరి సమక్షంలో పారదర్శకంగా జరిగే ఈ సర్వేలో భాగస్వామ్యం కావాలని హైడ్రా కోరింది. హైడ్రా సర్వే అంటూ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులను తప్పుదోవ పట్టిస్తున్న గోల్డెన్ కీ వెంచర్స్ నిర్వాహకులతో పాటు.. పలువురు ఆక్రమణదారులు వారి ఆక్రమణలు కప్పి పుచ్చుకోడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఎవరూ బలి కావద్దని హైడ్రా అధికారులు హితవు పలికారు. ఇప్పటికే పలు ఆరోపణల నేపథ్యంలో గోల్డెన్ కీ ఆస్తులను ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసిన విషయం విధితమే.. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని ఆర్టీసీ కాలనీ, రంగారావు వెంచర్, చక్రపురి కాలనీ వాసులు కూడా ఏమైనా కబ్జాలుంటే ఫిర్యాదు చేయాలని హైడ్రా పేర్కొంది. ఈ సమగ్ర సర్వేలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తామని హైడ్రా చెప్పింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని కాలనీ వాసులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని.. ఏమైనా ఫిర్యాదులుంటే హైడ్రా కార్యాలయానికి వచ్చి నేరుగా ఫిర్యాదు చేయాలని హైడ్రా అధికారులు సూచించారు.
Akhanda2 – Thaandavam: బాలయ్య కోసం గోల్డెన్ లెగ్.. తప్పించి తెచ్చారా, తప్పుకుంటే తెచ్చారా?
తాజావార్తలు
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్‌పింగ్‌కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్‌కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్‌లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!