స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై జాప్యం ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బహిరంగంగా ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీ ప్రకారం, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే బీసీల రిజర్వేషన్లు పెంచుతామని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఇప్పుడు ఏడాది గడిచినా ఏ మాత్రం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన కవిత, బీసీ గణన అశాస్త్రీయంగా నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడం మీ ప్రాధాన్యంగా కనిపిస్తోందని విమర్శించారు.
Wife For Rent: అద్దెకు భార్యలు? ఎక్కడో కాదు మన దేశంలోనే.. ధర ఎంతంటే?
కుల గణన పూర్తి అయినా ఇప్పటివరకు ఆ వివరాలను బహిర్గతం చేయకపోవడం, డెడికేటెడ్ కమిషన్ నివేదిక సిద్ధమయ్యిందని వార్తలు వస్తున్నప్పటికీ, తదుపరి కార్యాచరణపై స్పష్టత లేదని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల అంశాలపై మీ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోంది? బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చులకనగా చూస్తోందని నిలదీశారు. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచకపోతే ఊరుకోమని, ఇచ్చిన హామీ కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరని హెచ్చరించారు.
బీసీలకు ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి, 2024-25 బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదిలోనే కామారెడ్డి డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి ఉల్లంఘించారని కవిత విమర్శించారు. గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసి ఏడాది అవుతున్నా, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా, గ్రామాల్లో ప్రజాపాలనకు బదులు ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండడం దారుణమని అభిప్రాయపడ్డారు.
మీ ప్రభుత్వం త్వరగా బీసీ రిజర్వేషన్లను పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న సోయిలేని ధోరణి చూపిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని కవిత విమర్శించారు. బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే, బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీలను అమలు చేయించుకుంటుందని ఆమె హెచ్చరించారు.
Vizag: సాగర్ తీరంలో నకిలీ ఐఏఎస్ హల్‌చల్.. కిలాడీ లేడి ఆటకట్టించిన పోలీసులు