Sabitha Indra Reddy : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి యూజీసీ రూపొందించిన ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని విమర్శించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రతిపాదించిన కొత్త నిబంధనలపై చర్చించేందుకు తెలంగాణ భవన్‌లో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ ఆదేశాలతో పార్టీ వైఖరిని నిర్ణయించేందుకు అనేక నాయకులు పాల్గొన్నారు.
సబితా మీడియాతో మాట్లాడుతూ, యూజీసీ ప్రతిపాదించిన నిబంధనలపై అభిప్రాయాలు తెలియజేయాల్సిన గడువు ఈ నెల 30వరకు ఉందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదని ఆరోపించారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ, “విద్యా శాఖ మంత్రిగా ఆయనకు ఈ అంశంపై సమీక్ష చేసేందుకు సమయం దొరకడంలేదా?” అని ప్రశ్నించారు.
యూజీసీ ప్రతిపాదించిన కొత్త నిబంధనల ప్రకారం వీసీల నియామకాలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తాయని, ఇది రాష్ట్ర హక్కులకు తూట్లు పొడిచేలా ఉందని సబితా అన్నారు. ఇప్పటివరకు సెర్చ్ కమిటీ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు వీసీల నియామకాలు జరిగాయని, కానీ కొత్త నిబంధనలతో ఈ ప్రక్రియ పూర్తిగా గవర్నర్ ఆధీనంలోకి మారుతుందని వ్యాఖ్యానించారు.
Oscars 2025 Nominations: ఆస్కార్ నామినేషన్స్ 2025 ప్రకటన.. పూర్తి జాబితా ఇదే..
ఈ మార్పులను బీఆర్ఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తోందని సబితా స్పష్టం చేశారు. “రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది, యూజీసీ సిఫారసులను తిరస్కరించాలి,” అని ఆమె పేర్కొన్నారు. మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ, “యూజీసీ ముసాయిదాపై దాదాపు రెండున్నర గంటలపాటు విస్తృత చర్చ జరిగింది. ముసాయిదాలోని పదకొండు క్లాజుల్లో చాలా వరకు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తించాం. బీఆర్ఎస్ అభిప్రాయాన్ని యూజీసీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తాం,” అని చెప్పారు.
ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రవణ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, జి.దేవీప్రసాద్, చిరుమళ్ల రాకేశ్‌కుమార్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. యూజీసీ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ, రాష్ట్ర హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.
Komatireddy Venkat Reddy : ఆదిభట్లలో రతన్ టాటా విగ్రహం పెడతాం