Meerpet Murder Case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మీర్‌పేట్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ హత్య కేసులో క్లూస్ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో దర్యాప్తులో ముందుకెళ్తున్నారు పోలీసులు. గ్యాస్ స్టౌవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైంది. రెండింటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది క్లూస్ టీమ్.. దీంతో.. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మాధవి చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని బాత్రూమ్‌లోకి తీసుకెళ్లిన గురుమూర్తి.. బాత్రూమ్‌లో డెడ్‌బాడీని ముక్కలు ముక్కులుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టౌవ్‌పై పెట్టి గురుమూర్తి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగిగా తయారు చేశాడు గురుమూర్తి. అయితే.. ఆ ఎముకల పొడి మొత్తాన్ని బక్కెట్‌లో నింపి చెరువులో పడవేశాడు గురుమూర్తి.
Maharastra : ఆర్మీ ఆయుధ కర్మాగారంలో పేలుడు.. ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య..ఘటనకు కారణం ఏంటంటే ?
ఈ నేపథ్యంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ.. మీర్‌పేట్ మర్డర్ కేసులో విచారణ కొనసాగుతుందని, రాష్ట్రంలో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తో పాటు దేశంలో ఉన్న వివిధ ఎక్స్‌పర్ట్స్‌తో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నూతన టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కేసు దర్యాప్తుల దశలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇంతకంటే వివరాలు చెప్పలేమని, మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశామని,దర్యాప్తు పూర్తయినాక కేసుకు సంబంధించి అన్ని వివరాలు వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న కొత్త టెక్నాలజీ ద్వారా కేసు దర్యాప్తు చేయడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన తెలిపారు.
IRCTC: ట్రైన్ టికెట్ కు డబ్బులు లేకపోయినా.. జీరో పేమెంట్‌తో ఇలా బుక్ చేసుకోవచ్చు!