Bandi Sanjay : నాకు, పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ మధ్య ఎలాంటి విబేధాల్లేవు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇవాళ కరీంనగర్ బహిరంగ సభలో బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. కరీంనగర్ ను అభివృద్ధి చేయడమే నా ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. ఖట్టర్ కష్టపడి ఎదిగి.. కట్టర్ ఈ స్థాయికి వచ్చారని, అంతటి గొప్ప వ్యక్తి కరీంనగర్ రావడం మనందరి అదృష్టమన్నారు బండి సంజయ్. కరీంనగర్ లోని 4 వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటలపాటు నీళ్లందించడం గర్వకారణమని, కరీంనగర్ సిటీ మొత్తానికి 24 గంటలపాటు తాగునీళ్లందించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుండి సాయం చేయండన్నారు బండి సంజయ్. కరీంనగర్ లో డంప్ యార్డ్ తో ప్రజలు అల్లాడుతున్నారని, డంపింగ్ యార్డు సమస్య నుండి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పించండని బండి సంజయ్ కోరారు. స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లిస్తే కొట్లాడి సాధించడం జరిగిందని, వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాదం స్కీంలో చేరుస్తున్నామన్నారు. కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ లో చేరుస్తామని ఆయన వెల్లడించారు.
Donald Trump: ట్రంప్ ప్రకటనతో భారతీయ విద్యార్థుల్లో వణుకు.. వారి బాధలు వారి మాటల్లోనే…
అంతేకాకుండా..’సిరిసిల్ల, వంగర ప్రాంతాల్లో నవోదయ స్కూల్ ను ఏర్పాటు చేస్తున్నాం.. కరీంనగర్ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నాం.. మోడీ 10 ఏళ్లలో తెలంగాణకు 12 లక్షల కోట్లు ఖర్చు చేసింది.. రోడ్ల కోసమే లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినం.. రాష్ట్రంలోని 32 జిల్లాల్లో జాతీయ రహదారులను అభివ్రుద్ధి చేశాం.. కరీంనగర్ లో పుట్టిన బిడ్డగా, మానేరు నీరు తాగిన వ్యక్తిగా చెబుతున్నా… కరీంనగర్ ను సమగ్రాభివ్రుద్ధి చేయాలని కంకణం కట్టుకున్నా.. రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధి చేద్దాం.. రాజకీయాలను, జెండా, సొంత ఎజెండాలను పక్కనపెట్టాలని కోరుతున్నా’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Cricket Betting: విశాఖ క్రికెట్ బెట్టింగ్ ముఠా కేసులో సంచలన విషయాలు..