Viral Live Video: అయ్యో మోసం చేసిందే.. లైవ్‌లో చైనీస్ స్ట్రీమర్ అసలు ముఖం చూసి 1.4 లక్షల మంది పరార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Live Video: సోషల్ మీడియాలో మనం చూసేదంతా నిజం కాదని చెప్పడానికి ఈ ఘటన మంచి ఉదాహరణగా పని చేస్తుంది. ఫిల్టర్ల వెనుక దాక్కున్న అందం ఒక్క నిమిషం బయటపడితే ఏమౌతుందో స్టోరీ చదివితే అర్థం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియోల వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో ‘గ్లామర్’ అంటే కేవలం కెమెరా పనితనం కాదు, అంతకు మించి ‘ఫిల్టర్ల’ మాయాజాలం. యవ్వనంగా, మెరిసిపోయే చర్మంతో కనిపించే చాలా మంది వెనుక అసలు రహస్యం ఏమిటో చైనాకు చెందిన ఓ పాపులర్ లైవ్ స్ట్రీమర్ ఉదంతం బయటపెట్టింది. ఒక చిన్న టెక్నికల్ పొరపాటు ఆమె ఫాలోవర్ల సంఖ్యను తలకిందులు చేసిందంటే మాటలు కాదు.
READ ALSO: Balka Suman Arrest: మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. క్యాతన్‌పల్లిలో హైడ్రామా!
Also Read
- Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
- Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
- Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
- Ram Gopal Varma: "ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది".. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
లైవ్‌లో ఏం జరిగిందంటే..
చైనాలో ఒక మహిళా స్ట్రీమర్ లైవ్ నిర్వహిస్తోంది.. అందులో వేలమంది ఫాలోవర్లు పాల్గొన్నారు. లైవ్ స్క్రీన్‌పై ఆమె చాలా అందంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే, అకస్మాత్తుగా ఆమె వాడుతున్న ‘బ్యూటీ ఫిల్టర్’ మొరాయించింది. క్షణాల్లో ఆమె ముఖంపై ఉన్న మెరుగులు పోయి, ఆమె అసలు రూపం బయటపడింది. ఫిల్టర్‌లో యువతిలా కనిపించిన ఆమె, నిజానికి మధ్య వయస్కురాలు అని తేలిపోయింది. ఆమె అసలు రూపం చూడగానే నెటిజన్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ సెకను నుంచే సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ వీడియో బయటికి వచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1.4 లక్షల మంది ఆమెను అన్‌ఫాలో చేశారు. ఈ సందర్భంగా పలువురు ఫాలోవర్లు ఆమె వీడియోల కింద.. ఇంతకాలం మమ్మల్ని మోసం చేస్తావా? అంటూ కామెంట్స్ చేస్తూ, రకరకాల మీమ్స్‌తో విరుచుకుపడ్డారు.
ఈ ఘటన చూడగానే చాలా మందికి 2019లో వైరల్ అయిన “Your Highness Qiao Biluo” ఉదంతం ఒక్కసారిగా గుర్తొచ్చింది. అప్పట్లో కూడా ఒక స్ట్రీమర్ ఇలాగే ఫిల్టర్ ఫెయిల్ అవ్వడంతో అడ్డంగా దొరికిపోయి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. వర్చువల్ ప్రపంచంలో మనం చూసే ప్రతిదీ నిజం కాదని ఇది మరోసారి నిరూపించింది.
A Chinese female live streamer has gone viral after a beauty filter malfunctioned during a live broadcast, revealing her unfiltered appearance. Reports say the streamer lost nearly 140,000 followers shortly afterward.@prathibhatweets with more details. pic.twitter.com/wIyYcp1WzC
— TIMES NOW (@TimesNow) February 18, 2026
తాజావార్తలు
-
Nana Patekar: తరతరాలను అలరించిన గొప్ప నటుడు.. నానా పటేకర్‌కు గబ్బర్, జింక్స్ నివాళులు!
-
Delhi Police: రాహుల్, ప్రియాంక గాంధీలపై FIR.. అసలు కాంగ్రెస్ నిరసనలో ఏం జరిగింది?
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
ట్రెండింగ్
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?