CM Revanth Reddy : కేబినెట్ విస్తరణ అజెండాతో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్..?
- కేబినెట్ విస్తరణపై అధిష్టానం కీలక నిర్ణయం?
- ఢిల్లీలో సీఎం రేవంత్, ఏఐసీసీ నేతల మధ్య కీలక చర్చ
- తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కొత్త సమీకరణాలు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు.
ఈ హఠాత్ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని అంచనా వేయబడుతోంది. గత కొన్ని రోజులుగా కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం పలు దఫాలుగా చర్చలు జరిపింది. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడం, ఏయే నేతలకు మంత్రి పదవులు కట్టబెట్టాలి అనే అంశాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఇదే నేపథ్యంలో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
Also Read
- Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
- Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
- Kiren Rijiju: ‘‘యాంటీ-ఇండియా ఎవరో తెలిసిపోయింది’’.. అసదుద్దీన్ ఓవైసీపై కేంద్రమంత్రి ప్రశంసలు..
CM Revanth Reddy : ఎస్‌ఎల్‌బీసీ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావొస్తున్నప్పటికీ, పూర్తిస్థాయి కేబినెట్ ఏర్పడకపోవడం అధికార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు మంత్రి పదవుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పలు కీలక గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
రేవంత్ రెడ్డి అధిష్టానం ముందుకు రాష్ట్ర రాజకీయ పరిణామాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించనున్నారు. ఈ భేటీ అనంతరం, రేపట్లోనే మంత్రివర్గ విస్తరణపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
RRB ALP recruitment 2025: మళ్లీరాని ఛాన్స్.. రైల్వేలో 9,970 పోస్టులు.. ఇక వద్దన్నా జాబ్
తాజావార్తలు
-
Sri Lanka: శ్రీలంకలో తీవ్ర విద్యుత్ అంతరాయం.. నీరు, ఇంటర్నెట్ సేవలకు బ్రేక్!
-
Abhijeet Dipke: అభిజిత్ దీప్కేకు ఊరట.. షరతులతో బెయిల్..!
-
Bela Bajaria: వెయ్యి మందికి ఉద్వాసన.. ఇప్పుడు టాప్ బాస్‌పై వేటు! నెట్‌ఫ్లిక్స్‌లో ఏం జరుగుతోంది?
-
Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
-
TDP Candidates 2nd List: మున్సిపల్ ఎన్నికలకు టీడీపీ రెండో జాబితా విడుదల.. 22 మంది అభ్యర్థులు వీరే!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!