GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ మీట్ నిర్వహించనుంది. ఏప్రిల్ 7 నుండి 10 వరకు జరగనున్న ఈ క్రీడా ఉత్సవంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అదనపు కమీషనర్ యాదగిరి రావు మాట్లాడుతూ, విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం వేదికలుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లీగ్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నాటికి పూర్తవుతుండగా, ఫైనల్స్ ఏప్రిల్ 10న జరుగనున్నాయి.
క్రీడా పోటీలు వివిధ విభాగాల్లో కొనసాగనున్నాయి. ముఖ్యమైన క్రీడా ఈవెంట్స్, వాటి నిర్వహణా స్థలాలు ఈ విధంగా ఉన్నాయి:
పురుషుల కోసం
క్రికెట్ – DRF ట్రైనింగ్ సెంటర్ గ్రౌండ్, ఫతుల్లాగూడ, నాగోల్
కబడ్డీ – విక్టరీ ప్లే గ్రౌండ్
వాలీబాల్ – విక్టరీ ప్లే గ్రౌండ్
చెస్ – విక్టరీ ప్లే గ్రౌండ్
షటిల్ బ్యాడ్మింటన్ – ఉప్పల్ ఇండోర్ స్టేడియం
క్యారమ్స్ – విక్టరీ ప్లే గ్రౌండ్
అథ్లెటిక్స్ – విక్టరీ ప్లే గ్రౌండ్
మహిళల కోసం
చెస్ – విక్టరీ ప్లే గ్రౌండ్
షటిల్ బ్యాడ్మింటన్ – ఉప్పల్ ఇండోర్ స్టేడియం
మ్యూజికల్ చెయిర్ – విక్టరీ ప్లే గ్రౌండ్
టెన్నికాయిట్ – విక్టరీ ప్లే గ్రౌండ్
క్యారమ్స్ – విక్టరీ ప్లే గ్రౌండ్
లెమన్ & స్పూన్ రేస్ – విక్టరీ ప్లే గ్రౌండ్
గెలుపొందిన టీమ్స్‌కి భారీ నగదు బహుమతులు
ఈ క్రీడా పోటీలలో విజేతలకు నగదు బహుమతులు, మెమెంటోలు, సర్టిఫికెట్స్ అందించనున్నారు.
మొదటి బహుమతి – ₹10,000
రెండో బహుమతి – ₹6,000
మూడో బహుమతి – ₹3,000