Gudimalkapur : పాత బస్తీ చంద్రాయణగుట్ట చెందిన నలుగురు యువకులు (వయసు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు ) 1. అబ్దుల్ రెహమాన్ బా నయీం, 2. సౌత్ బిన్ సైది, 3. మొహమ్మద్ సుల్తాన్ పటేల్ (అప్స్కాడింగ్) 4. మహమ్మద్ సులేమాన్ పటేల్ (అప్స్కాడింగ్) ఒక కిడ్నాప్కి పాల్పడ్డాడు. కత్తులు చూపించి కిడ్నాప్ కి పాల్పడినట్టు తెలుస్తుంది. కిడ్నాప్ కి గురైన వ్యక్తి పేరు నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి, పాతబస్తీ చంద్రాయన గుట్ట నివాసి వయస్సు సుమారు 27 సంవత్సరాలు,
కిడ్నాప్ కి గురైన నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి మరియు మహమ్మద్ సులేమాన్ పటేల్ వీరు ఇద్దరి మధ్య డబ్బుల లావాదేవీలకు సంబంధించి ఈ నెల ఆరో తారీఖున సాయంత్రం సుమారు 7:30 నుంచి 8 గంటల సమయంలో అబ్దుల్ రెహమాన్ బా నయీం నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి కి ఫోన్ చేసి PVNR పిల్లర్ నెంబర్ 55 మిలాప్ ఫంక్షన్ హాల్ ఎదురుగా రమ్మని చెప్పడం జరిగింది,
నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి చెప్పిన స్థలానికి చేరుకున్న వెంటనే మహమ్మద్ సులేమాన్ పటేల్ మరియు తనతో కారులో (వైట్ కలర్ ఫోర్ ఎండీవర్ కార్ నెంబరు TS 08 FP 9888) వచ్చిన ముగ్గురు స్నేహితుల సహకారంతో బలవంతంగా కత్తులు చూపించి భయప్రాంతానికి గురిచేసి కారులో కూర్చోబెట్టుకొని మహేశ్వరం వైపు తీసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడ కారులో వాగ్వాదం జరుగుతూ ఓవర్ స్పీడ్ నడపడం వల్ల కారు ప్రమాదానికి గురైంది.
కారు ప్రమాదం జరిగినట్లు స్థానికులు మహేశ్వరం పోలీసులకి సమాచారం ఇచ్చిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న మహేశ్వరం పోలీసులు… అక్కడ కిడ్నాప్ కి గురైన నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి పోలీసులకు కిడ్నాప్ చేశారని చెప్పడం జరిగింది, అయితే ప్రమాదం జరిగిన వెంటనే అన్నదమ్ములు ఇద్దరు సుల్తాన్ పటేల్ సులేమాన్ పటేల్ ఆయుధాలు తీసుకొని సంఘటన స్థలం నుంచి ఫరాయర్ అయిపోయారు, మిగతా ఇద్దరినీ పోలీసులు అదుపులో తీసుకొని, కిడ్నాప్ జరిగిన సంఘటన స్థలం గుడిమల్కాపూర్ పోలీస్ పరిధిలోని కాబట్టి మహేశ్వరం పోలీసులు కేసును గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది.
గుడిమల్కాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే నాసిర్ బిన్ సయ్యద్ ఖురేషి మరియు మహమ్మద్ సులేమాన్ పటేల్ మధ్య గత నెల చంద్రాయన గుట్ట పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా జరిగింది.
New Brands : 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు.. మద్యం మార్కెట్ విస్తరణ దిశగా మరొక అడుగు