Registrations : సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఆధునికత.. త్వరితగతిన రిజిస్ట్రేషన్లకు కీలక నిర్ణయం
- త్వరితగతిన రిజిస్ట్రేషన్లకు కొత్త విధానం
- మొదటి దశలో 22 కార్యాలయాల్లో అమలుకు సిద్ధం
- రోజువారీ పని వేళలు – 48 స్లాట్లుగా విభజన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Registrations : రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు మరింత వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా సేవలు అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల ఆధునీకరణ కొనసాగుతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, కేవలం 10–15 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు. మొదటి దశగా రాష్ట్రంలోని 144 సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 22 కార్యాలయాల్లో ఈ విధానం ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానుంది. హైదరాబాదులో ఆజంపుర, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట వంటి ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు.
ఒకేసారి ఎక్కువ దస్తావేజులు సమర్పించడం వల్ల జరిగే జాప్యాన్ని నివారించేందుకు ప్రతి కార్యాలయంలో పని వేళలను 48 స్లాట్లుగా విభజించారు. ప్రజలు registration.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని, నిర్ణీత సమయంలో హాజరై రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. అత్యవసరంగా రాబోయే వారికి ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఐదు వాక్-ఇన్ రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. స్లాట్ బుకింగ్ విధానాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అధిక రద్దీ ఉన్న కార్యాలయాలకు అదనపు సబ్-రిజిస్ట్రార్లను నియమించనున్నట్లు మంత్రి తెలిపారు. ఉదాహరణగా, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్-రిజిస్ట్రార్లు నియమించబడ్డారు. తద్వారా అక్కడ 144 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. పని భారాన్ని సమతుల్యం చేయడం కోసం, అధిక రద్దీ ఉన్న మరియు తక్కువ రద్దీ ఉన్న కార్యాలయాల పరిధిని సమీక్షించి విలీనం చేస్తామని, మొదటగా చంపాపేట – సరూర్ నగర్ కార్యాలయాలను విలీనం చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
Rahul Gandhi: ‘‘భారత రాజ్యాంగం 1000 ఏళ్ల పాతది’’.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
తాజావార్తలు
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!