గోరంట్ల మాధవ్ వ్యవహారంలో.. 12 మంది పోలీసులపై చర్యలు
వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో 12మంది పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. మాజీ సీఎం జగన్ సతీమణి భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐ టీడీపీ నేత చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు తీసుకొస్తున్న సమయంలో గోరంట్ల మాధవ్ పోలీస్ కాన్వాయ్ ను వెంబడించడం, గుంటూరు చుట్టగుంట సెంటర్ లో కిరణ్ పై దాడికి ప్రయత్నించారు. ఎస్పీ కార్యాలయంలోకి గోరంట్ల మాధవ్, అతని అనుచరులు రావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
వనజీవి రామయ్య మృతి చాలా దురదృష్టకరం, బాధాకరం
పద్మశ్రీ గ్రహీత, పర్యావరణ పరిరక్షకుడు వనజీవి రామయ్య మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలో మాట్లాడుతూ మంత్రి ఆయన మృతిని “చాలా దురదృష్టకరమైనది, బాధాకరమైనది” అన్నారు. “పద్మశ్రీ వనజీవి రామయ్య మనకు కనిపించనంతగా దూరమయ్యారు. ఇది మనం తట్టుకోలేని నష్టం,” అని మంత్రి అన్నారు. ప్రభుత్వ పక్షాన, తన వ్యక్తిగత పక్షాన రామయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. “ఒక మనిషి జీవించినంత కాలం ఏమి సాధించాడన్నది చాలా ముఖ్యమైన అంశం. రామయ్య గారు తన జీవితాన్ని ప్రకృతి పరిరక్షణకు అంకితంగా వెచ్చించారు. ఆర్థికంగా ఒడిదుడుకుల మధ్య కూడా కోటి మొక్కలకు పైగా నాటి, వాటిని పెంచిన ఘనత ఆయనకు చెందుతుంది,” అని మంత్రి పొంగులేటి వివరించారు.
మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం.. పట్టుబడ్డ ఇద్దరు విద్యార్దులు
సిద్దార్ధ వైద్య కళాశాలల్లో మళ్ళీ ఎంబీబీఎస్ విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కలకలం రేపింది. గత బుధవారం జనరల్ మెడిసిన్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ముగ్గురు విద్యార్ధులు. శనివారం కమ్యూనిటీ మెడిసిన్ (పార్ట్ 1) పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్ధులు పట్టుబడ్డారు. మాల్ ప్రాక్టీస్ కు పాల్పడిన విద్యార్దులను ఎన్నారై, నిమ్రా కళాశాల విద్యార్థులుగా గుర్తించారు. 160 మంది విద్యార్దులు పరీక్ష రాస్తుండగా ఇద్దరు పట్టుబడ్డారు. గత బుధవారం ఘటనతో యునివర్సిటీ స్పెషల్ స్క్వాడ్ ను రంగంలోకి దించింది. స్క్వాడ్ తనిఖీల్లో స్లిప్పులతో దొరికిపోయారు ఇద్దరు విద్యార్ధులు. విద్యార్ధుల జవాబు పత్రాలను, గుర్తింపు కార్డులను ఇన్విజిలెటర్లు స్వాధీనం చేసుకున్నారు. జవాబు పత్రాలను మాల్ ప్రాక్టీస్ కమిటీకి అధికారులు పంపించారు. ఈ నెల 21వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. వరుస మాల్ ప్రాక్టీసు ఘటనలతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
రెవెన్యూ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లాలో రెవెన్యూ అధికారుల పనితీరుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ అనేది చాలా కీలకమైనది.. ముఖ్యంగా రెవిన్యూలో ఎవరు చేయలేనిది ఓన్లీ రెవిన్యూ సిబ్బంది మాత్రమే చేయగలుగుతారు.. ఎమ్మార్వో స్థాయి నుండి కలెక్టర్ స్థాయి వరకు బాగానే పనిచేస్తున్నారు.. కానీ కింద స్థాయి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు.. నేను ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నా.. మంత్రిగా కాదు.. జిల్లాలోని ప్రతి ఒక్క నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో జేసీ, కలెక్టర్ స్థాయిలో మీటింగ్ ఏర్పాటు చేయాలి.. ఆ మీటింగ్ కు వీఆర్వోలు అందరిని పిలిపించాలి..
14న భూ భారతి ప్రారంభోత్సవం….
భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందబాటులో ఉండేలా భూ భారతి పోర్టల్ ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి తెలిపారు. భూ భారతిని సోమవారం ప్రారంభించనున్న నేపథ్యంలో తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రతి మండలంలోనూ కలెక్టర్ల ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.
కష్ట సమయంలో ప్రధాని మోడీ స్పందన మరువలేనిది
ఏపీ డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గత కొద్ది రోజుల క్రితం అగ్రిమాదానికి గురైన విషయం తెలిసిందే. సింగపూర్ స్కూల్ అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ను అక్కడి ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్స అందించారు. తన కొడుకును చూసేందుకు పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లారు. కాగా ఇవాళ మార్క్ శంకర్ తో ఇండియాకి తిరిగొచ్చారు పవన్ కళ్యాణ్ దంపతులు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. “నా కుమారుడు మార్క్ శంకర్ ప్రమాదంలో చిక్కుకుని గాయాలపాలు కావడంపై స్పందించిన ప్రతీ ఒక్కరికీ నా ధన్యవాదాలు.. జనసైనికులకి, సీనీరంగంలోని నా శ్రేయోభిలాషులకి ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు.. మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు.. మీ అందరి హృదయపూర్వక మెసేజ్ లు మాకు ఎంతో బలాన్నిచ్చాయి.. నేను ఆదివాసీ ప్రాంతాలలో పర్యటనలో ఉండగా నా కుమారుడికి ప్రమాదం జరిగింది..ఆ సమయంలో ప్రధాని మోడీ స్పందన ఎంతో ధైర్యాన్నిచ్చింది.. సింగపూర్ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించారు..
విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై పట్టుబిగిస్తున్న కూటమి..
విశాఖ గ్రేటర్ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టుబిగిస్తోంది.. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జనసేనలోకి 74వ వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీకి అగ్ని పరీక్షగా మారింది అవిశ్వాసం ఓటింగ్. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 74 మ్యాజిక్ ఫిగరు చేరాలి. ఇప్పటికకే కూటమికి 70 మంది కార్పొరేటర్ల బలం ఉంది. వైసీపీకి ఎక్స్ అఫీషియో సభ్యులు ముగ్గురు, మరో 33 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరం అవుతుంది. ఇవాళ కూటమి ఎమ్మెల్యేలు కీలక సమావేశం కానున్నారు. ఇప్పటికే విదేశాల్లో వైసీపీ, టీడీపీ శిబిరాలు ఏర్పాటు చేశాయి. కానీ, ఇరు వర్గాల నుంచి పూర్తిస్థాయిలో క్యాంప్ లకు కార్పోరేటర్లు వెళ్లడం లేదు. ఓటింగ్ కు వెళ్లాలా.. వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీకి వదిలేసింది సీపీఐ.
న్యూ0డ్ సెల్ఫీ వీడియోలను పంపిన యువతి.. చివరకు ఏమైందంటే?
పల్నాడు జిల్లాలో ఓయువతి ప్రాణం తీసింది న్యూడ్ వీడియో. నరసరావుపేట మండలం పమిడిమర్రు ఎస్సీ కాలనీకి చెందిన మురికిపూడి సిఫారా(23)ఎలుకల మందు త్రాగి మృతి చెందింది. ఈ నెల 8న ఎలుకల మందు తిని ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా ఇంట్లోనే ఉన్నది సిఫార. ఆరోగ్యం క్షీణిస్తుండడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కాగా సిఫారకి అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తరచూ నాగరాజుకు తన న్యూడ్ సెల్ఫీ వీడియోలను సిఫార పంపించేది.
అమ్మకు నానమ్మ, తాతయ్య నచ్చరంట.. క్శశ్చన్ పేపర్‌లో విద్యార్థినీ సమాధానం వైరల్
సాధారణంగా చిన్నారులు పరీక్షల సమయంలో తమ ఊహాశక్తిని ఉపయోగించి సమాధానాలు రాస్తుంటారు. అయితే ఒక్కోసారి వారి సమాధానాలు నవ్వించడమే కాక, సమాజాన్ని ఆలోచనలో పడేస్తాయి. అలాంటి ఒక సంఘటన చందుర్తి మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. చదువులో భాగంగా జరిగిన ఆంగ్ల పరీక్షలో నాలుగో తరగతి విద్యార్థిని ఒకరికి “Write about your mother’s likes and dislikes” అనే ప్రశ్న వచ్చింది. అంటే “మీ అమ్మకు నచ్చినవి, నచ్చని విషయాలు రాయండి” అన్నమాట.