Drunken Drive : హైదరాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుండి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు ట్యాంకర్ డ్రైవర్ యాదగిరిపై బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 325 బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) పాయింట్స్ […]
ఆ వైసీపీ ఎమ్మెల్యేకి అరెస్ట్ భయం పట్టుకుందా? ఎప్పుడు లోపలేస్తారో తెలియదని కంగారు పడుతున్నారా? అందుకే నియోజకవర్గంలో తిరగడం కూడా మానేశారా? తనతో పాటు తన అన్న, ఆయన కొడుకు కూడా కనీసం ఆరు నెలలు జైల్లో ఉండాల్సి వస్తుందని ఓపెన్‌గానే చెప్పేస్తున్నారా? మరి మిమ్మల్ని నమ్ముకుని చెలరేగిన మా సంగతేంటని కేడర్ అడిగితే సమాధానం లేదా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటాయన జైలు భయం? తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై ఇప్పుడు నియోజవర్గంలో […]
GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఆధ్వర్యంలో క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ మీట్ నిర్వహించనుంది. ఏప్రిల్ 7 నుండి 10 వరకు జరగనున్న ఈ క్రీడా ఉత్సవంలో కార్పొరేటర్లు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు. జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అదనపు కమీషనర్ యాదగిరి రావు మాట్లాడుతూ, విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం వేదికలుగా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లీగ్ మ్యాచ్‌లు ఏప్రిల్ 9 నాటికి పూర్తవుతుండగా, ఫైనల్స్ ఏప్రిల్ […]
Bandi Sanjay : ఎంఎంటీఎస్ నుండి దూకి గాయాలపాలై గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి కుటుంబ సభ్యులతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఫోన్ లో పరామర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్ విషయం తెలిసిన వెంటనే ఆ యువతి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జరిగిన ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన […]
Akbaruddin Owaisi : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న వేళ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సభలో తన ప్రత్యేక శైలిలో వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలు ఇచ్చే హామీలు, అవి అమలయ్యే విధానం, ప్రజలకు అందే ప్రయోజనాలను ఉద్దేశించి ఆయన ఒక ఫన్నీ స్టోరీ చెబుతూ నేరుగా ప్రభుత్వ తీరును ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో ప్రసంగిస్తున్న అక్బరుద్దీన్ ఓవైసీ, హైదరాబాద్‌లో ఉన్న ఇద్దరు ఫేకులు గురించి ఒక కథను వినిపించారు. ఈ కథ ప్రభుత్వాలు […]
CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హస్తినకు బయలు దేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరిన వీరు, సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో సమావేశం కానున్నారు. ఈ హఠాత్ పర్యటన వెనుక ప్రధాన కారణం కేబినెట్ విస్తరణ కావొచ్చని […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం SLBC సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సహాయక చర్యలను వేగంగా అమలు చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేకించి, సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలని సీఎస్‌ను (చీఫ్ సెక్రటరీ) ఆదేశించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి, SLBC సహాయక చర్యలపై తాజా […]
MLC Kavitha : హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై జరిగిన అత్యాచారయత్న ఘటనపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత యువతి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ, మహిళల భద్రతపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై తీవ్ర స్పందన తెలియజేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రైల్వే ఎస్పీ చందన దీప్తితో ఫోన్లో మాట్లాడారు. యువతిపై జరిగిన దాడి ఘటన గురించి పూర్తిగా వివరాలు తెలుసుకున్నారు. తనను రక్షించుకునేందుకు […]
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు […]
Murder : రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. కందుకూరు మండలం సరస్వతిగూడ గ్రామానికి చెందిన సుధాకర్ (34), డ్రైవింగ్ చేస్తూ జీవనం సాగించేవాడు. అదే గ్రామానికి చెందిన శశికళ తన అవసరాల కోసం సుధాకర్ వద్ద డబ్బు అప్పుగా తీసుకుంది. నిన్న మధ్యాహ్నం సుధాకర్‌కు డబ్బు అవసరం కావడంతో శశికళ ఇంటికి వెళ్లి తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే ఈ విషయంలో సుధాకర్‌కు శశికళ, ఆమె తమ్ముళ్లు మాదరమోని శేఖర్, […]