CM Revanth Reddy : అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇళ్లు కేటాయించాలి..
- ఇందిరమ్మ కమిటీల అనుమతితోనే లబ్ధిదారుల ఎంపిక
- అర్హుల జాబితాను మండల అధికారుల బృందం తనిఖీ చేయాలి
- ఇందిరమ్మ ఇళ్ల సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy :అత్యంత నిరుపేదలు, అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు దక్కాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. గ్రామ స్థాయిలో లబ్ధిదారుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీలు జాగ్రత్త వహించాలని.. అర్హులనే ఎంపిక చేయాలని సీఎం అన్నారు. ఇందిరమ్మ కమిటీ తయారు చేసిన జాబితాను మండల అధికారులతో కూడిన (తహశీల్దార్, ఎంపీడీవో, ఇంజినీర్) బృందం క్షేత్ర స్థాయికి వెళ్లి తనిఖీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎవరైనా అనర్హులకు ఇల్లు దక్కినట్లయితే తక్షణమే దానిని ఇందిరమ్మ కమిటీకి తెలియజేసి ఆ స్థానంలో మరో అర్హునికి ఇల్లు మంజూరు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఎవరైనా దందాలు చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే కేసులు నమోదు చేయాలన్నారు. అనర్హులు ఎవరైనా ఇల్లు దక్కించుకొని నిర్మించుకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం పాటు వారు పొందిన మొత్తాన్ని వసూలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుకు మంజూరైన ఇంటికి అతని సౌలభ్యం ఆధారంగా అదనంగా 50 శాతం మేర నిర్మించుకునే అవకాశం కల్పించాలని సీఎం అన్నారు. లబ్ధిదారుకు ఆర్థికపరమైన ఊరట లభించేందుకుగానూ సిమెంట్, స్టీల్ తక్కువ ధరలకు అందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సమీక్షలో రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శులు వి.శేషాద్రి, చంద్రశేఖర్‌రెడ్డి, సీఎం జాయింట్ సెక్రటరీ సంగీత సత్యనారాయణ, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్దప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!