Telangana : విద్యార్థుల కోసం నిజంగా ఇది పండుగల వారం! ఇప్పటికే శనివారం (రెండో శనివారం) , ఆదివారం సెలవులతో సరదాగా గడుపుతున్న పిల్లలకు మరో శుభవార్త వెల్లడైంది. సోమవారం (ఏప్రిల్ 14) కూడా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. దీనితో విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విశ్రాంతి లభించబోతోంది.
ఈ సెలవు ప్రత్యేకత ఏంటంటే… ఏప్రిల్ 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. దానిని అనుసరించి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణలోని విద్యాశాఖలు తమ అధికారిక క్యాలెండర్లలో కూడా ఈ తేదీని పబ్లిక్ హాలిడేగా చేర్చాయి.
ఈ వెకెండ్‌లో ఆదివారం సెలవుతోపాటు, సోమవారం కూడా సెలవు రావడంతో విద్యార్థులు ఆనందంలో మునిగిపోయారు. పాఠశాలలకు మాత్రమే కాదు, బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు కూడా రేపు మూతపడనున్నాయి. ఇదంతా కాకుండా, ఈ నెల 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్బంగా మరోసారి విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. అంటే ఏప్రిల్‌లో విద్యార్థులకు విశ్రాంతి సమయాలు మరింత పెరగనున్నాయి. ఈ వరుస సెలవులు విద్యార్థులకు నూతన ఉత్సాహాన్ని అందిస్తాయి. పాఠశాలల హడావుడి నుంచి తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుని, కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశం ఇది.
UP CM Yogi Adityanath: వక్ఫ్ చట్టం పేరుతో హింసను ప్రేరేపిస్తున్నారు..