Rythu Bandhu : మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు 90 శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. ఈరోజు మంత్రి ఖమ్మంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలించడం జరుగుతుందని, అవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతుబంధు నిధులు మరో రెండు రోజుల్లో జామవుతాయని చెప్పారు. ఉగాది రోజున ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ […]
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం.. సందిగ్ధంలో బీజేపీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ దూరంగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సరైన బలం లేని కారణంగా పోటీకి దూరంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే, సూత్రపాత్రయంగా మజ్లిస్ పార్టీకి హస్తం పార్టీ మద్దతు ఇస్తుంది. కాగా, మరోవైపు, గ్రేటర్ హైదారాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై భారతీయ జనతా పార్టీ ఇంకా తుది నిర్ణయం […]
హైదరాబాద్ నగరంలో ప్రజావసరాలకు అనుగుణంగా అనుసంధాన (లింక్) రోడ్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాజధాని నగరంతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో హైదరాబాద్ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ (హెచ్ఆర్డీసీఎల్) ఆధ్వర్యంలో చేపడుతున్న అనుసంధాన రహదారుల నిర్మాణం, విస్తరణపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 49 రోడ్ల నిర్మాణం, విస్తరణపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల మధ్య అనుసంధానత పెంచడం, ప్రజలు ఎటువంటి అవాంతరాలు లేకుండా […]
Pastor Praveen : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ మిస్టరీ డెత్ కేసుపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కీలక ప్రకటన చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఈనెల 24వ తేదీన హైదరాబాద్ నుండి బయలుదేరి, రాజమండ్రి శివారు కొంతమూరు వద్ద అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఐజీ అశోక్ మాట్లాడుతూ, “పాస్టర్ ప్రవీణ్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1 గంటకు చౌటుప్పల్ టోల్ […]
RS Praveen Kumar : తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రస్తుతం రాక్షస, రాబందుల పాలన నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి మీద 83 కేసులు ఉన్నప్పటికీ, ఆయన సీఎం, హోంమంత్రి హోదాలో ఉండడం దౌర్భాగ్యమన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి బాధితుడు, ఫిర్యాదుదారుడు, హోంమంత్రి, జైలు సూపరింటెండెంట్, తలారీ.. ఇలా అన్నీ ఆయనే అయ్యాడు” అని […]
Betting Gang : హైదరాబాద్‌లోని హఫీజ్‌పేట్‌లో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠాను మియాపూర్ SOT పోలీసులు బట్టబయలు చేశారు. ఫేక్ కంపెనీల పేరిట బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేసి, ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మాడిశెట్టి అజయ్, అతని భార్య సంధ్య కలిసి మూడు క్రికెట్ బెట్టింగ్ యాప్స్ ద్వారా భారీ స్థాయిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించబడింది. పోలీసులు వీరి అకౌంట్లను పరిశీలించగా, ఏకంగా 40 లక్షల రూపాయల విలువైన […]
Gun Fire : హైదరాబాద్, గుడిమల్కాపూర్‌లోని కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వహించిన ఆనం మీర్జా ఎక్స్‌పోలో కాల్పుల కలకం చోటుచేసుకుంది. ఎక్స్‌పోలో ఇద్దరు షాప్ కీపర్ల మధ్య వాగ్వాదం తలెత్తి తీవ్ర స్థాయికి చేరుకుంది. తీవ్ర వాగ్వాదం అనంతరం, వారిలో ఒకరు గాలిలో కాల్పులు జరపడంతో అక్కడున్న వారిలో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కాల్పుల శబ్దంతో సందడి నెలకొనగా, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు గాలిలో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని […]
తెలంగాణలో ఇక మీదట కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? అసెంబ్లీ వేదికగా ఆ ప్రకటన చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రత్యేక సందేశం పంపారా? అసలు సభ సాక్షిగా ఆ ప్రకటన చేయడాన్ని ఎలా చూడాలి? రేవంత్‌రెడ్డి దూకుడు తగ్గించుకున్నారా? లేక వ్యూహం మార్చారా? ఆయన మాటల వెనక శ్లేషలు దాగున్నాయా? ఆ విషయమై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ… సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ […]
ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదా? ఏకంగా పార్టీకే డెడ్‌లైన్ పెట్టి అల్టిమేటమ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇన్నాళ్ళు చేసిన రచ్చ ఒక ఎత్తు, తాజా వివాదం మరో ఎత్తులా ఉండబోతోందా? ఎమ్మెల్యే వాఖరి మీద పార్టీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నారా? తిరువూరు ఎమ్మెల్యే గురించి టీడీపీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, ఎగ్రెసివ్ నేచర్‌తో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కొలికపూడి శ్రీనివాస్. […]
Bhatti Vikramarka : ఏప్రిల్ 8, 9 తేదీల్లో గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణ, వ్యూహాలు, విధానాల రూపకల్పనతో పాటు రాజకీయ నిర్ణయాలపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇందులో డ్రాఫ్టింగ్ కమిటీ ప్రధాన భూమికను పోషించనుంది. ఈ డ్రాఫ్టింగ్ కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరియు జనరల్ సెక్రటరీ కే.సి. వేణుగోపాల్ ఈ […]