CM Revanth Reddy : తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా కీలక ముందడుగు పడింది. తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ సంస్థ అయిన తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) రెండు ప్రముఖ జపాన్ సంస్థలతో కీలక ఒప్పందాలపై సంతకాలు చేసింది. టోక్యోలో అధికారిక పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రెవంత్ రెడ్డి సమక్షంలో, TERN (TGUK Technologies Pvt. Ltd.) , రాజ్ గ్రూప్ సంస్థలతో ఈ ఒప్పందాలపై TOMCOM అధికారికంగా సంతకాలు చేసింది.
ఈ ఒప్పందాల ద్వారా జపాన్‌లో పెరుగుతున్న ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణ నుండి నైపుణ్యం గల యువతిని నియమించేందుకు వీలవుతుంది. ఒప్పందాల ప్రకారం రాబోయే 1-2 సంవత్సరాలలో సుమారు 500 ఉద్యోగాల అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వాటిలో.. హెల్త్‌కేర్ (కేర్‌గివింగ్) – 200 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్ (ఆటోమొబైల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్/ఐటీ) – 100 ఉద్యోగాలు.. హాస్పిటాలిటీ – 100 ఉద్యోగాలు.. కన్స్ట్రక్షన్ (సివిల్, బిల్డింగ్, మెంటెనెన్స్ తదితరాలు) – 100 ఉద్యోగాలు ఉన్నాయి.
TERN గ్రూప్ టోక్యోలోని షినాగావా ప్రాంతంలో కార్యాలయంతో, సాఫ్ట్‌వేర్, ఇంజినీరింగ్ , స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్ (SSW) విభాగాల్లో నైపుణ్యాల కోసం ప్రపంచ వ్యాప్తంగా నిపుణులను నియమిస్తుంది.
రాజ్ గ్రూప్ ఇప్పటికే జపాన్‌లో ప్రముఖ నర్సింగ్ కార్పొరేషన్ అయిన Tsukui Corporation తో భాగస్వామ్యంగా కేర్‌గివింగ్ రంగంలో TOMCOMతో పని చేస్తోంది. తాజా ఒప్పందంతో ఇది ఆరోగ్య రంగా తో పాటు ఇతర రంగాలకు కూడా విస్తరించనుంది.
ఈ ఒప్పందాలు టెలంగాణ యువతకు అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను అందించడంలో కీలక మైలురాయిగా నిలవనున్నాయి. ఇది టెలంగాణను ప్రపంచ నైపుణ్య ఉన్నత కేంద్రంగా మారుస్తూ, యువతకు విజయవంతమైన భవిష్యత్తుకు మార్గదర్శకంగా ఉంటుంది.
Devendra Fadnavis: “మరాఠీ” తప్పనిసరి.. హిందీ వివాదంపై సీఎం ఫడ్నవీస్..