Resonance : జేఈఈ మెయిన్‌లో ‘రెసోనెన్స్’ విజయ దుందుభి
- జేఈఈ మెయిన్‌లో 'రెసోనెన్స్' చారిత్రాత్మక విజయం
- విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సత్కారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Resonance : ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ 2025లో హైదరాబాద్‌లోని ‘రెసోనెన్స్’ జూనియర్ కళాశాలల విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారు. మాదాపూర్ లో గల రెసోనెన్స్ స్కూల్ విజ్డమ్ క్యాంపస్‌లో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను రెసోనెన్స్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జరిగిన ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో అద్భుత విజయం సాధించడం రెసోనెన్స్ ప్రతిభ మరోసారి నిరూపితమైందన్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, ఇతర మెడికల్ ప్రవేశ పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంకులు సాధించడంలో ముందంజలో ఉన్నామన్నారు. రెసోనెన్స్ విద్యార్థి అర్చిస్మాన్ 295/300 స్కోర్ చేయడంతో ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చిందన్నారు. హైదరాబాద్ రెసోనెన్స్ జూనియర్ కళాశాలలకు చెందిన ముగ్గురు విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 100 పర్సెంటైల్ సాధించారన్నారు. 57 మంది విద్యార్థులు 99 పర్సెంటైల్ పైగా మార్కులు సాధించారన్నారు. మొత్తం 285 మంది విద్యార్థులు విభిన్న సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ పైగా వచ్చాయన్నారు.

Also Read
- YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
- Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
- International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
- H1N1 Cases Rise: మళ్లీ H1N1 వైరస్ విజృంభణ.. లక్షణాలు ఏంటి? ఎవరికి ప్రమాదం ఎక్కువ?
రెసోనెన్స్ హైదరాబాద్ విద్యార్థులు ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ పరీక్షల్లో దేశవ్యాప్తంగా అసాధారణ విజయాలు సాధించారన్నారు. హైదరాబాద్‌లోని అన్ని క్యాంపస్‌ల నుంచి 1500 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హత పొందారన్నారు. అందులో 57 మంది విద్యార్థులు 99 శాతం పైగా సాధించారని చెప్పడం గర్వంగా ఉందన్నారు. ఇది మా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషికి నిదర్శనమన్నారు. టాప్ 4 విద్యార్థులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి లక్ష రూపాయల స్కాలర్‌షిప్ ఇవ్వడం జరిగిందన్నారు. హైదరాబాద్ క్యాంపస్‌ల నుంచి పల్లా శివ సంకేత్ రెడ్డి, పీ వెన్నెల, పీ దివిత్ రెడ్డి వివిధ సబ్జెక్టుల్లో 100 పర్సెంటైల్ సాధించారన్నారు.

జేఈఈ మెయిన్ 2025లో 99.31 శాతం పైగా ఎన్టీఏ స్కోరు సాధించిన హైదరాబాద్ విద్యార్థులు వీరు.. వేదాంత్ సక్సేనా (99.9492), నాగంవార్ హరితేజ్ (99.9226), సురవరం ప్రణయ్ రెడ్డి (99.9067), పల్లా శివ సంకేత్ రెడ్డి (99.8799), పీ వెన్నెల (99.7884), అవనీష్ నితిన్ కాబ్రా (99.7120), పీ దివిత్ రెడ్డి (99.6929), బింగి శ్రీహర్ష (99.6900), గాండ్ల అనిరుధ్ (99.6435), ఎండీ రిఫా ఉర్ రెహమాన్ (99.5851), సిద్ధార్థ రాఘవ (99.5659), క్షితిజ్ జైన్ (99.5611), పోలనాటి అనిష్ (99.5500), ప్రణయ్ వెంకటేష్ (99.5179), వీ శశి కౌశిక్ (99.4890), బీ తన్మయ్ కార్తీక్ (99.4446), ప్రాథా అకిరి (99.3631), తవనం శ్రీవిద్య (99.3525), హర్షిత రాంగోజు (99.3357), ఎస్ రెథేష్ (99.3150).

రెసొనెన్స్ గురించి
దేశవ్యాప్తంగా జేఈఈ, ఎన్ఐటీ, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించే రెసోనెన్స్ 2001వ సంవత్సరంలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఆర్కే వర్మ స్థాపించారు. దీని ప్రయాణం రాజస్థాన్లోని కోటాలో ప్రారంభమైంది. రెండు దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించింది. రెసోనెన్స్ ప్రస్తుతం 87 నగరాల్లో 150 పైగా కేంద్రాలతో కలదు. ఇప్పటివరకు తొమ్మిది లక్షలకు పైగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది . 3,25,000 పైగా విద్యార్థులను ఐఐటీ, ఎన్ఐటీ, మెడికల్ ర్యాంకర్లుగా తీర్చిదిద్దింది. ఈ అద్భుత విజయాలతో 2018లో హైదరాబాద్‌లో ప్రవేశించింది. పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో ప్రారంభమైన రెసోనెన్స్ హైదరాబాద్ కేంద్రాలు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయి. ప్రతి ఏడాది 80 శాతానికి పైగా విద్యార్థులు విజయవంతంగా అర్హత సాధిస్తూ.. హైదరాబాద్ విద్యా రంగంలో రెసోనెన్స్ ఒక విశ్వసనీయ బ్రాండ్‌గా నిలిచింది.
మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి: 9959154371 / 9963980259

తాజావార్తలు
-
Jana Nayagan OTT Release: విజయ్ ‘జన నాయగన్’ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్.. ఏ ప్లాట్ఫామ్లో అంటే?
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
International Credit Cards: భారతీయులకు క్రెడిట్ కార్డులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న గ్లోబల్ బ్యాంక్స్.. ఎందుకంటే?
-
Ravi Teja -Vivek : రవితేజ – వివేక్ ఆత్రేయ సినిమాకు నిర్మాతగా దిల్ రాజు పాత స్నేహితుడు
ట్రెండింగ్
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్‌ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్‌ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!