Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఎంఐఎం సభ
- నక్సలైట్ల వారసులు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు
- ప్రజాస్వామ్యంలో ఉంటూ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటారా?
- హిందూ సమాజమంతా రగలిపోతోంది : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ దూరంగా ఉండాలని బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయంతోపాటు ఎన్నికల్లో పోటీ చేయని కాంగ్రెస్ పైనా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు దూరంగా ఉండేది, ఓటింగ్ ను బహిష్కరించేది నక్సలైట్లు మాత్రమేనని అన్నారు. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలని మండిపడ్డారు. అలాంటి పార్టీలను రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల విప్ లకు భయపడి ఓటింగ్ కు దూరంగా ఉన్నా, మజ్లిస్ పార్టీని గెలిపించినా ఆయా పార్టీల కార్పొరేటర్ల రాజకీయ భవిష్యత్తు ఖతం కాబోతోందని హెచ్చరించారు. తెలంగాణలోని 85 శాతం హిందువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. విప్ లకు భయపడి నిర్ణయం తీసుకుంటారో, ఓటింగ్ కు హాజరై మజ్లిస్ ను ఓడిస్తారో తేల్చుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు సూచించారు.
ఈరోజు సాయంత్రం హైదరాబాద్ బర్కత్ పురాలోని బీజేపీ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో నగర కార్పొరేటర్లు, ముఖ్య నాయకులతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షలు చింతల రామచంద్రారెడ్డి, డాక్టర్ మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, గౌతమ్ రావు, రాంచంద్రరావు, లంకల దీపక్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, గుండగోని భరత్ గౌడ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై పార్టీ నేతలకు సంజయ్ దిశానిర్దేశం చేశారు.
Also Read
- HMWSSB: తాగునీటిని వృథా చేస్తే ఫైన్.. ఫిర్యాదు చేయడానికి వాట్సాప్ నంబర్ ఇదే..
- Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
‘‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆ రెండు పార్టీలు పోటీ చేయకుండా మజ్లిస్ ను గెలపించాలని చూస్తున్నయి. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామన్న మజ్లిస్ తో కలిసి ఆ రెండు పార్టీలు అంటకాగుతున్నాయి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే అంశాన్ని వాడవాడలా ప్రచారం చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లకు వివరించండి. హిందువుల మనోభావాలను వివరించండి. బీజేపీ అభ్యర్ధి గౌతమ్ రావును గెలిపించండి.’’అని కోరారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత పార్టీ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు గెలిచామని, ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ పీఠంపై కాషాయ జెండా ఎగరవేయడం తథ్యమన్నారు. పార్టీ కోసం, సిద్దాంతం కోసం నిరంతరం పనిచేసిన గౌతమ్ రావును ఎమ్మెల్సీ అభ్యర్ధిగా గెలిపించే అవకాశం వచ్చినందున ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి గెలిపించాలని కోరారు.
అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. ‘‘ఎన్నికలను బహిష్కరించాలని చెప్పేదెవరు? నక్సలైట్లు మాత్రమే. ఆ నక్సలైట్ల వారసులే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు’’అని మండిపడ్డారు. ‘‘10 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్. 15 నెలలుగా అధికారాన్ని అనుభవిస్తున్న పార్టీ కాంగ్రెస్. ఈ రెండు పార్టీలు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున జరిగే ఎన్నికలకు దూరంగా ఉండటం సిగ్గు చేటు. వీళ్లకు అభ్యర్థులే కరువయ్యారని చెప్పడం సిగ్గు చేటు. ఎన్నికలపై, ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కానీ 24 మంది సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా దూరంగా ఉండటం హాస్యాస్పదం.’’అని అన్నారు. ఓటింగ్ దూరంగా ఉండాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లకు విప్ జారీ చేయనున్న విషయాన్ని మీడియా ప్రస్తావించగా ‘‘విప్ లు, గిప్ లు ఏమీ పనిచేయవు. ఎందుకంటే జీహెచ్ఎంసీ పాలక మండలి గడువు ఇంకా 6 నెలలు మాత్రమే. పొరపాటున ఆ పార్టీల విప్ కు భయపడి కార్పొరేటర్లు మజ్లిస్ కు ఓటేసినా, ఎన్నికలకు దూరంగా ఉన్నా వాళ్ల పని ఖతమైనట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నూకలు చెల్లినట్లే’’అని పేర్కొన్నారు.
‘‘గ్రేటర్ హైదరాబాద్ లో 85 శాతం మంది హిందువులే ఉన్నారు. గోమాతను వధిస్తున్న వాళ్లకు, 15 నిమిషాల టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ప్రగల్భాలు పలికిన మజ్లిస్ వాళ్లను గెలిపిస్తారా? అంటూ హిందువులంతా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. అన్ని డివిజన్లలో హిందూ సమాజమంతా ఒక్కటైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ కు ఓటేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లను చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారు. మీ పార్టీల అధిష్టానాల ఆదేశాలు ముఖ్యమా?….. మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా? తేల్చుకోండి. మజ్లిస్ ను ఓడిస్తే… మిమ్ముల్ని అక్కున చేర్చుకుని గెలిపించే బాధ్యతను మేం తీసుకుంటాం’’’’అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలే లేవని, ఆ పార్టీల భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. మజ్లిస్ ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పాతబస్తీలో జరిగే బహిరంగ సభ కాంగ్రెస్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అంతా కాంగ్రెస్ పార్టీయేనని, ఆ పార్టీ సూచన మేరకు మజ్లిస్ పార్టీ ముస్లిం సంఘాలతో కలిసి బహిరంగ సభ పెట్టారే తప్ప ఆ పార్టీతో అయ్యేదేమీ లేదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ‘‘తెలంగాణలో 77 వేల ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలముంది. దీనిద్వారా వందల కోట్ల ఆదాయం వస్తోంది. ఆ సొమ్ముతో ఏ ఒక్క పేద ముస్లిం కుటుంబానికైనా న్యాయం చేశారా? వారి అభ్యున్నతి కోసం ఖర్చు చేశారా? మీకు నిజంగా దమ్మూ ధైర్యముంటే తెలంగాణలో వక్ఫ్ ఆస్తులెన్ని? ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి? వక్ఫ్ ఆస్తుల ద్వారా ఎంత ఆదాయం వస్తోంది? అందులో పేదలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? ఆ వివరాలపై శ్వేత పత్రం విడుద ల చేయాలి’’అని డిమాండ్ చేశారు. గతంలో ట్రిపుల్ తలాఖ్ పైనా మజ్లిస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ నేతలు ఇట్లనే ఆందోళన చేయాలని కుట్రలు చేశారని, ముస్లిం మహిళలంతా తిరగబడటంతో తోకముడిచిందన్నారు. బీజేపీ నేతలు రాముడి వారసులు కారంటూ కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘‘ఎవరు రాముడి వారసులో… ఎవరు రామ మందిరం నిర్మించారో… ఎవరు రాముడిని తిట్టారో…అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకించిందెవరో… 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపేస్తామని ప్రకటించిన వాళ్లకు ఎవరు మద్దతిస్తున్నారో ప్రజలకు తెలుసు. సమయం వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.’’అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!