Maoists : మావోయిస్టు పార్టీ లోపల విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇటీవల విడుదల చేసిన “సాయుధ పోరాట విరమణ” ప్రకటనపై మావోయిస్టు నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు జగన్ అనే పేరుతో కేంద్ర కమిటీ తరఫున రెండు పేజీల లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో అభయ్ చేసిన ప్రకటన పూర్తిగా వ్యక్తిగతమని, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గత కొన్ని నెలలుగా శాంతి చర్చల కోసం పార్టీ తరఫున ప్రతిపథనలు జరుగుతున్నప్పటికీ, ఆయుధాలను వదిలివేయడం, సాయుధ పోరాటానికి ముగింపు పలకడం వంటి ఏకపక్ష నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగించే ప్రయత్నాలుగా పేర్కొన్నారు.
చిన్న గింజలు, చియా గింజల్లో పెద్ద ప్రయోజనాలు !
జగన్ విడుదల చేసిన లేఖలో, “ఈ ఏడాది మార్చి నుండి మేము శాంతి చర్చల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆపరేషన్ కాగర్ నిలిపివేసి, శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని మా డిమాండ్. అయితే పార్టీ చర్చలు లేకుండా, వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకుని ప్రకటనలు చేయడం అనర్హం” అని హెచ్చరించారు. అలాగే కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు కొందరు అనారోగ్యం కారణంగా లొంగిపోతున్నారని, శాంతి చర్చలపై అభిప్రాయాలు పంపించాలంటూ అభయ్ ఇచ్చిన మెయిల్ అడ్రస్ ఎటువంటి అర్థం ఉండదని లేఖలో పేర్కొన్నారు.
“ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని ఉంటే బాగుండేది. కానీ ఆయుధాలు వదిలేస్తామని ఏకపక్షంగా ప్రకటించడం తీవ్రంగా అభ్యంతరకరమైందే కాకుండా పార్టీ ప్రతిష్టను దెబ్బతీయడం” అని జగన్ లేఖలో స్పష్టం చేశారు. ఈ లేఖతో మావోయిస్టు పార్టీలో ఉన్న లోతైన విభేదాలు మళ్లీ బహిర్గతమయ్యాయి. ఒకవైపు శాంతి చర్చలపై ఆసక్తి చూపుతున్నా, మరోవైపు ఆయుధాలు పూర్తిగా వదిలివేయడంపై మాత్రం అంగీకారం కరువైనట్లు కనిపిస్తోంది.
Eluru : ఎలూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతల ఆందోళన…అడ్డుకున్న పోలీసులు