తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లేదా? జోడెద్దుల్లా నడిపించాల్సిన ఆ నాయకుడే నత్తనడకన ఉన్నారా? నిజంగా ఆయన పని చేయడం లేదా? లేక చేయనివ్వడం లేదా? అందివచ్చిన బంగారంలాంటి అవకాశాన్ని వాడుకోలేకపోతున్నారని చర్చ జరుగుతున్న ఆ నాయకుడు ఎవరు? ఎందుకంత సంక్లిష్టతలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అవడమంటే అంత ఈజీ కాదు, ఆషామాషీ వ్యవహారం కాదు. దానికి చాలా ఈక్వేషన్స్ అండ్ కేలిక్యులేషన్స్ ఉంటాయి. కానీ… తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్గౌడ్ […]
CM Revanth Reddy : గత ఏడాది ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు పై చేసిన వ్యాఖ్యలపై, ఆయన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో, బీజేపీ అధికారం చేపట్టినప్పుడు రిజర్వేషన్లను తొలగిస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను ఆధారంగా, పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టుకు ఆడియో, వీడియో క్లిప్స్ సమర్పించారు. Sri Chaitanya : తెలంగాణ ఇంటర్మీడియేట్ […]
జూనియర్ ఇంటర్ MPCలో 470 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 468తో 103 మంది, 467 ఆపైన 462 మంది, 466 ఆపైన 1073 మంది, 460 ఆపైన 4490, 450 ఆపైన 8479 ఆపైన శ్రీచైతన్య విద్యార్థులే. జూనియర్ ఇంటర్ BiPCలో 440 మార్కులకు గాను శ్రీచైతన్య స్టేట్ టాప్ మార్క్ 438 తో 26 మంది, 437ఆపైన 136 మంది. 436 ఆపైన 304 మంది. 435 ఆపైన 459 మంది, […]
Fraud: ఉప్పల్ ప్రాంతంలో ఒక బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని చెప్పి ప్రజలను మోసగొట్టే ఘటన వెలుగు చూసింది. ఢిల్లీకి చెందిన సల్మాన్ అనే వ్యక్తి, ఇంస్టాగ్రామ్ ద్వారా శరవేగంగా ప్రచారం చేసి, బట్టతల మీద వెంట్రుకలు మొలుస్తాయని వాగ్దానం చేశాడు. ఈ ప్రకటనతో బాధితులు పెద్ద సంఖ్యలో ఉప్పల్ భాగయత్ లోని శిల్పారామం వద్ద ఆయన ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద చేరుకున్నారు. సల్మాన్ తన స్వతంత్రంగా ఏర్పాటు చేసిన స్టాల్ వద్ద బట్టతల మీద […]
పదో తరగతి ఫలితాల్లో సంచలనం.. తొలిసారిగా 600కు 600 మార్కులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే, గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఉత్తీర్ణత శాతం నమోదైంది. కాగా, ఇవాళ విడుదలై టెన్త్ ఎగ్జామ్ ఫలితాల్లో ఓ విద్యార్థిని సంచలనం సృష్టించింది. కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి […]
GHMC : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో జరిగిన లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం పోలింగ్ శాతం 78.57 గా నమోదైంది. ఉదయం ప్రారంభమైన ఓటింగ్ నిరాటంకంగా కొనసాగింది. ఈ ఎన్నికల్లో మొత్తం 88 ఓట్లు నమోదు అయ్యాయి. అందులో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం ప్రారంభమైన పోలింగ్ సజావుగా కొనసాగి సాయంత్రం 4 గంటలకు […]
Ponnam Prabhakar : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంను ఉగాది పండుగ సందర్భంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలో సన్న బియ్యం పథకం లబ్ధిదారులతో భోజనం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ పథకానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సన్న బియ్యం పథకం ప్రజల మంచి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన చారిత్రాత్మక పథకంగా మారిందని, ఈ పథకం […]
HYDRAA : హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA) తన గుర్తింపులో ఒక పెద్ద మార్పును ప్రకటించింది. ఇంతకు ముందు ఈవీడీఎం (EVDM) లోగోను వినియోగిస్తున్న హైడ్రా, ఇకపై కొత్త లోగోతో తన కార్యకలాపాలను కొనసాగించనుంది. ఈ మార్పు సంస్థకు సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ గుర్తింపు పెంచేలా ఆకర్షణీయంగా రూపుదిద్దబడింది. హైడ్రా యొక్క కొత్త లోగోలో “హెచ్” అక్షరంపై నీటి బొట్టు ఆకృతిని చేర్చారు. ఈ రూపకల్పన నీరు, పరిరక్షణ, , ప్రభుత్వ […]
Marri Rajashekar Reddy : మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు […]
పొలిటికల్ స్క్రీన్ మీద అన్నదమ్ముల సవాల్లో కొత్త సీన్స్ కనిపించబోతున్నాయా? ఎన్నికల్లో ఓడిపోయి పదినెలలు కామ్గా ఉన్న అన్న ఇప్పుడెందుకు తమ్ముడు టార్గెట్గా సోషల్ వార్ మొదలుపెట్టారు? ఉన్నట్టుండి ఈ మార్పునకు కారణం ఏంటి? అన్న కమ్ మాజీ ఎంపీ… ఇప్పుడు తమ్ముడు కమ్ సిట్టింగ్ ఎంపీ మీదికి కొత్త అస్త్రాల్ని సంధించబోతున్నారా? ఎవరా పొలిటికల్ వారియర్ బ్రోస్? ఏమా ఫ్యామిలీ డ్రామా? కేశినేని నాని…బెజవాడ నుంచి టిడిపి తరఫున రెండుసార్లు వరుసగా ఎంపీగా గెలిచిన నాయకుడు. […]