Tragic : హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. బాలిక, ఆమె ప్రియుడు, అతని తమ్ముడు కలిసి మాతృహత్యకు పాల్పడిన ఈ ఘటన వెనక ప్రేమ, కోపం, హింసల మేళవింపుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. కేవలం ఎనిమిది నెలల క్రితం ఓ బాలికకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శివ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వయసులో పదో తరగతి చదువుతున్న ఈ బాలిక అప్పటికే తన వయస్సును మరిచిపోయి ప్రేమలో మునిగిపోయింది. విషయం తెలిసిన తల్లి అంజలి “ఇంకా నీకు చదువు పూర్తవలేదు… ప్రేమ అవసరమా?” అంటూ మందలించిందట. దీంతో.. కొంతకాలంగా వారిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ, ప్లాన్‌లు వేసుకుంటూ, నమ్మకంగా పెరుగుతున్న సంబంధాన్ని ఎలాగైనా కొనసాగించాలనే దృఢ సంకల్పంతో ఉన్నారు.
ఒక వారం క్రితం, బాలిక శివతో కలిసి ఇంటినుంచి వెళ్లిపోయింది. ఈ విషయంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసుల పర్యవేక్షణలో మూడ్రోజుల క్రితం ఆమె తిరిగి ఇంటికి వచ్చింది. అయితే, అప్పటికే ఆమె మనసులో ఒక భీకరమైన స్కెచ్ సిద్ధమవుతోందని ఎవరూ ఊహించలేదు. తల్లిని ప్రేమ బంధానికి అడ్డుగా భావించిన బాలిక, ప్రియుడు శివతో కలిసి తల్లి అంజలి హత్యకు పథకం వేసింది. ఈ పథకంలో శివ తమ్ముడు యశ్వంత్ కూడా భాగస్వామిగా మారాడు.
JD Vance: ఇరాన్‌కు అణ్వాయుధ సామర్థ్యం లేదు.. జేడీ వాన్స్ కీలక ప్రకటన
నిన్న సాయంత్రం, నల్గొండ నుంచి శివ జీడిమెట్లకు వచ్చాడు. అప్పటికి అంజలి ఇంట్లో అంజలి పూజలు చేసుకుంటూ నిమగ్నమై ఉంది. అదే సమయంలో శివ వెనుక నుంచి దాడికి దిగాడు. బెడ్‌షీట్‌తో ఆమె ముఖాన్ని కప్పి ఆమెను అశక్తురాలిని చేశాడు. ఆ సమయంలో ఆమె స్వయంగా తల్లి తలపై సుత్తితో కొట్టిన బాలిక అత్యంత దారుణంగా ప్రవర్తించిందని పోలీసులు చెబుతున్నారు. తరువాత కత్తితో తల్లిని చంపిన పని శివ తమ్ముడు యశ్వంత్ చేపట్టాడు. ముగ్గురూ కలిసి చేసిన ఈ హత్య చాలా నిర్దాక్షిణ్యంగా, నిర్మానుష్యంగా జరుగింది.
అంజలి ఒక సామాన్య మహిళ కాదు. ఆమె చాకలి ఐలమ్మ మునిమనవరాలు. స్వాతంత్ర్య సమరయోధురాల వారసురాలిగా ఉన్న ఆమె జీవితాంతం కష్టపడిన మహిళ. ఇలాంటి పుణ్యవంతురాలిని ఆమె సొంత కూతురు, ప్రియుడు, అతని తమ్ముడు కలిసి అంతమొందించారు అన్నది ఇప్పుడు సమాజాన్ని కలచివేస్తోంది.
జీడిమెట్ల పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన ఆధారాలు సేకరిస్తూ, హత్యకు గల అసలు ఉద్దేశ్యం, ప్లానింగ్, మానసిక స్థితి వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సంఘటన పెరుగుతున్న టెక్నాలజీ, మారుతున్న విలువలు, తల్లిదండ్రులకు వ్యతిరేకంగా పిల్లల నిర్ణయాలు వంటి విభిన్న కోణాల్లో ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. తల్లిదండ్రులకు ఇది ఒక్క హెచ్చరిక మాత్రమే కాదు.. సమాజానికీ ఇది శోచనీయ సంకేతం.
Chengalpattu Express Robbery: చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ.. కేబుల్ కత్తిరించి..!