Anjali Murder : హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో జరిగిన తల్లి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓ పదో తరగతి చదువుతున్న బాలిక, ఆమె ప్రేమికుడు శివ, అతని తమ్ముడు కలిసి దారుణంగా తల్లి అంజలిని హత్య చేసిన ఘటన ఒక్కసారికి నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే.. ఈ దారుణ ఘటనపై నిందితురాలు తేజ శ్రీ చెల్లి ప్రియ ప్రత్యక్ష సాక్షి.. అయితే.. ఆమె ఎన్టీవో మాట్లాడుతూ.. ట్యూషన్ నుంచి వస్తున్న నన్ను మా అక్క గల్లీ లోనే ఆపిందని, అమ్మ ఒక ఆంటీ ను తీసుకుని రమ్మంది. పదా వెళ్దాం అని తీసుకెళ్లిందని తెలిపింది. 20 నిమిషాల తర్వాత అక్కా నేను ఇంటికి చేరుకున్నామని, అప్పటికే కిచెన్ లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉందని పేర్కొంది. అమ్మను నేను చూసుకుంటా.. నువ్వు బయటకు వెళ్ళి మీ ఫ్రెండ్ ఎవరినైనా తీసుకుని రా.. గల్లీ లో ఆంటీ వాళ్లకు ఎవరికీ చెప్పకు అని చెప్పిందని వెల్లడింది.
Netanyahu: ఇరాన్‌తో కాల్పుల విరమణపై నెతన్యాహు కీలక ప్రకటన
అంతేకాకుండా.. మా అమ్మ ఇంకా చనిపోలేదు అని తెలుసుకున్న అక్క.. మళ్ళీ శివ కి కాల్ చేసిందని, అమ్మ ఇంకా చనిపోలేదు. కాళ్లు చేతులు ఆడిస్తోంది అని చెప్పింది. మళ్ళీ శివ, యశ్వంత్ వచ్చారు. సుత్తి తో అమ్మ తలపై కొట్టారు.. చనిపోయింది అని నిర్ధారించుకున్న తర్వాత వెళ్ళిపోయారు.. నేను అప్పుడే వచ్చాను. చూసే సరికి అమ్మ రక్తపుమడుగులో పడి ఉంది.. వెళ్ళి చేతులు రుద్దాను.. లేపే ప్రయత్నం చేశాను. కానీ అక్క మాత్రం దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్ అన్నదని ప్రియ వెల్లడింది. ఈ ఘటన యావత్తు సమాజంలో పరిస్థితులకు ప్రశ్నార్థకంగా మారింది. నేటి యువత ఏ దారిలో వెళ్తున్నారే.. రోజు రోజుకు పిల్లలు చేజారిపోతున్నారా..? అనే ప్రశ్నలు మదిలో మెదలడం ఖాయమనిపస్తోంది.
VIVO T4 Lite 5G: రూ.9,999 లకే ఇంత పవర్‌ఫుల్ ఫోన్ మరోటి ఉండదేమో.. వివో T4 లైట్ 5G మొబైల్ లాంచ్..!