Murder : జనగామలో దారుణం.. ఇద్దరు అక్కాచెల్లెళ్లు కలిసి భర్తను హత్య
- తల్లి హత్యకు ప్రతీకారంగా భర్తను హత్య చేసిన భార్యలు
- పిట్టలోనిగూడెంలో ఒకే కుటుంబంలో రెండు హత్యలు
- గొడ్డలితో దాడి.. భర్తను ముక్కలు చేసిన ఇద్దరు భార్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Murder : జనగామ జిల్లా పిట్టలోనిగూడెంలో కట్టుకున్న భర్తను ఇద్దరు భార్యలు కడతేర్చారు. తమ తల్లిని హతమార్చడంతో.. కట్టుకున్న భర్తపై పగ తీర్చుకున్నారు. దీంతో పిట్టలోనిగూడెంలో రెండు హత్యలు జరిగాయి. ఈ హత్యలు జనగామ జిల్లాలో సంచలనం సృష్టించాయి. ఇక్కడ ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కాలియా కనకయ్య. ఇతనికి చొక్కమ్మ, గౌరమ్మ అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిద్దరు సొంత అక్కాచెల్లెళ్లు…
కాలియా కనకయ్య.. సొంత ఊరు జనగామ జిల్లా పిట్టలోని గూడెం. అతడు సొంతూళ్లో జులాయిగా తిరుగుతుంటాడు. ఊరిలో కనిపించిన అందరితో గొడవలు పెట్టుకునే వాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాలలో అత్త జున్నుబాయి ఉంటుంది. ఆమె మామిడి తోటలో ఉండగా.. తాగిన మైకంలో గొడ్డలితో నరికి చంపేశాడు కనకయ్య. మరో గ్రామంలో మామిడితోటలో ఉన్న తన ఇద్దరు భార్యలకు విషయం చెప్పకుండా వారిని తీసుకొని సిద్దిపేటకు పారిపోయాడు…
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
విషయం పోలీసులకు తెలిసి కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా కనకయ్య సిద్దిపేటలో ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడకు వెళ్లి పట్టుకునేలోపు పారిపోయాడు. ఈ విషయం చొక్కమ్మ, గౌరమ్మలకు తెలియడంతో పిట్టలోనిగూడేనికి తిరిగివచ్చారు. అప్పటి నుంచి కనకయ్య పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో రాత్రి సమయంలో పిట్టలోనిగూడెం వచ్చిన కనకయ్య భార్యలతో గొడవ పడ్డాడు. దీంతో గూడెంలోని ప్రజలంతా నిద్రలేచి అక్కడకు వచ్చారు. గొడవ తీవ్రంగా జరిగింది. ఈ క్రమంలో కోపోద్రిక్తులైన చొక్కమ్మ, గౌరమ్మ.. వరుసకు సోదరులైన జనార్దన్, శ్రీనివాసులుతో కలిసి గొడ్డలితో కనకయ్యను హత్య చేశారు. కనకయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు.
నేర చరిత్ర కలిగిన కనకయ్య తాగిన మైకంలో ఏం చేస్తాడో తెలియదని, క్రూరమృగంలా ప్రవర్తించి.. మహిళలతో వావివరుసలు లేకుండా వ్యవహరిస్తాడని గ్రామస్తులు చెప్పుకొచ్చారు. మహిళలు ఇంట్లోనుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితులు ఉండేవన్నారు. అతని చేష్టలపై గతంలో పంచాయితీలు పెట్టి పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు చెప్పారు.
Kanakadurgamma Temple: ప్లేట్ కలెక్షన్ నిలిపివేత.. ఇంద్రాకిలాద్రిపై పంతుళ్ల లొల్లి!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు