Tragedy: మద్యానికి బానిసైన కన్నతల్లి ముక్కు పచ్చలారని కన్న కూతురినే కడతేర్చింది. అభం శుభం తెలియని బోసి నవ్వుల చిన్నారిని దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. హృదయాన్ని కలిచివేసే ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది.
ఇక్కడ చూడండి.. ఇక్కడ బెడ్‌పై తాపీగా కూర్చున్న మహిళ పేరు రమ్య. ఈమెకు నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం గోనుగొప్పులకు చెందిన గంగోని మల్లేష్‌తో 2 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ ఆడబిడ్డ జన్మించింది. ప్రస్తుతం అమ్మాయి వయసు 5 నెలలు. ఆ చిన్నారికి ముద్దుగా శివాని అని పేరు కూడా పెట్టారు. మల్లేష్ ఓ రైస్ మిల్లులో హమాలీగా పనిచేస్తు ఇంటిని పోషిస్తున్నాడు…
Health Tips: డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు
రమ్య మద్యానికి బానిసైంది. రోజూ మద్యం లేనిదే ఉండలేకపోతోంది. ఐతే ఆమెను మద్యం మానమని భర్త మల్లేష్ ఎన్నోసార్లు చెప్పి చూశాడు. కానీ రమ్య తన తీరు మార్చుకోలేదు. అంతే కాదు మద్యం తాగుతూ 5 నెలల పాపను కూడా పట్టించుకోవడం మానేసింది..
మద్యం మాని పాపను పట్టించుకోమని… లేకుంటే ఇంటి నుంచి వెళ్ళి పొమ్మని మల్లేష్ మందలించాడు. ఐతే ఆ చిన్నారికి జ్వరం రావటం మందులు పోయకపోవటంతో భార్య, భర్త మధ్య గొడవైంది. దీంతో రమ్య… ఫుల్లుగా తాగి దారుణానికి పాల్పడింది. తాగిన మైకంలో ఐదు నెలల కూతురు శివాని ముఖం మీద దుప్పటి కప్పి గొంతు నులిమి చంపేసింది. రాత్రి సమయంలో ఇంటికి వచ్చిన భర్త కూతురు ఎక్కడ అని అడిగాడు. కూతురు చనిపోయింది అని చెప్పింది. కూతురు శివాని ఎలా చనిపోయిందని అడగగా.. ఏదో పురుగు కుట్టి చనిపోయింది అంటూ బుకాయించింది. అది నమ్మని భర్త మల్లేష్ గట్టిగా అడగగా తాను చేసిన ఘనకార్యం బయటపెట్టింది…
భర్త మల్లేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హంతకురాలు రమ్యను అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ కు తరలించారు. మద్యం మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా కన్న కూతురునే చంపేసింది ఆ కసాయి తల్లి. పైగా కూతురు పోయిందన్న బాధ కూడా ఆమెలో కనిపించడం లేదు..
Kanakadurgamma Temple: ప్లేట్ కలెక్షన్ నిలిపివేత.. ఇంద్రాకిలాద్రిపై పంతుళ్ల లొల్లి!