HYDRA : రెండు కాలనీల మధ్య ‘హైడ్రా’ బ్రిడ్జ్.. అడ్డుగోడ తొలగింపుతో కలిసిన కాలనీలు
- అడ్డుగోడ తొలగింపు.. రెండు కాలనీలకు కలయిక
- ప్రజావాణిలో ఫిర్యాదు.. హైడ్రా వెంటనే స్పందన
- 1.5 కిమీ మార్గం ఇప్పుడు 300 మీటర్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYDRA : హైద్రాబాద్ నగరంలో రెండు కాలనీల మధ్య సౌకర్యాన్ని హైడ్రా సంస్థ మరింత మెరుగుపరిచింది. హబ్సీగూడ ప్రాంతంలోని స్ట్రీట్ నంబర్ 6 వద్ద ఉన్న అడ్డుగోడను తొలగించడం ద్వారా నందనవనం, జయానగర్ కాలనీల మధ్య అనుసంధానం ఏర్పడింది. దీని వల్ల రెండింటికీ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గింది.
Rare-earths: “అరుదైన భూమి” కోసం భారత్ ఆరాటం.. చైనాకు చెక్ పెట్టే ప్లాన్..
Also Read
గతంలో నందనవనంలోని స్ట్రీట్ నంబర్ 4 నుంచి హబ్సీగూడ మెయిన్ రోడ్ చేరేందుకు వాసులు దాదాపు 1.5 కిలోమీటర్లు చుట్టువాటు ప్రయాణించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అడ్డుగోడ తొలగింపుతో కేవలం 300 మీటర్ల దూరంలోనే ఎన్జీఆర్‌ఐ మెట్రో స్టేషన్ చేరుకునే అవకాశం లభించిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గురువారం ఉదయం హైడ్రా టీమ్ హస్తకల్పంగా ఈ అడ్డుగోడను తొలగించింది. ‘‘15 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులను కలిసి కోరినా స్పందన రాలేదు. జయానగర్ అసోసియేషన్ ప్రతినిధులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. చివరికి హైడ్రా ద్వారా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో తక్షణమే చర్యలు తీసుకుని మార్గం తెరిచారు,’’ అని నందనవనంలోని కాంక్రీట్ ట్రంపెట్ అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. ఈ పరిణామంతో దశాబ్దాలుగా ఎదురైన సమస్యకు పరిష్కారం లభించడంతో స్థానికులు హైడ్రా టీమ్‌పై కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?