Phone Tapping : రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి బుధవారం బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. సిట్ చేపట్టిన దర్యాప్తులో 2023 నవంబర్ 15నుంచి ఈ ఇద్దరు ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయని సమాచారం. కేవలం ఎంపీల ఫోన్లు మాత్రమే కాకుండా, వారితో అనుబంధం ఉన్న ముఖ్య అనుచరులు, కుటుంబసభ్యుల ఫోన్లు […]
అమరావతి: ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. కొన్ని ముఖ్య శాఖలకు సంబంధించి సీఎం చంద్రబాబు సమీక్ష. నేడు ఆల్ పార్టీ పార్లమెంట్ సభ్యులతో మంత్రి ఉత్తమ్ సమావేశం. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. అఖిలపక్ష ఎంపీలను స్వయంగా ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సీఎం రేవంత్‌తో పాటు పాల్గొననున్న ఆల్ పార్టీ ఎంపీలు. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతో పాటు బీజేపీ, BRS ఎంపీలకు లేఖ రాసిన మంత్రి […]
NTV Daily Astrology as on June 18th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
KTR : హైదరాబాద్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఫార్ములా ఈ కార్ రేస్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్)ను ఏసీబీ అధికారులు మూడున్నర గంటలపాటు విచారించారు. ఈ విచారణ సందర్భంగా కేటీఆర్‌ను ప్రశ్నలతో ఏసీబీ అధికారులు నరకాడేశారు. ఆయన సమాధానాలు, సమర్పించిన వివరాలన్నీ అధికారులు శ్రద్ధగా నమోదు చేశారు. ముఖ్యంగా ఆయన పాత్రపై ఇప్పటికే కొన్ని అధికారులు స్టేట్మెంట్లు ఇచ్చిన నేపథ్యంలో విచారణ మరింత ఉత్కంఠతరంగా మారింది. ఏసీబీ అధికారులు […]
Vemulawada : దశాబ్దకాలంగా వాయిదా పడుతూ వచ్చిన వేములవాడ పట్టణంలోని రోడ్ వెడల్పు పనులకు ఆదివారం అధికారులు ప్రారంభసూచి ఇచ్చారు. మటన్ మార్కెట్ ప్రాంతంలో ఉన్న మున్సిపల్ దుకాణాలను అధికారుల పర్యవేక్షణలో జేసీబీలతో కూల్చివేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి చర్యలు చేపట్టారు. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజన్న ఆలయం వరకు రోడ్డును 80 అడుగుల వెడల్పుతో విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రూ.47 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 260 నిర్వాసితులలో […]
ప్రధానిగా పదకొండేళ్లు పూర్తిచేసుకున్న మోడీ.. మరోసారి గెలుపు దిశగా ఆలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారం దక్కించుకున్న బీజేపీ.. నాలుగోసారి పవర్లోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది. మన దేశంలో నాలుగోసారి వరుస గెలుపు అంత తేలిక కాదనే వాదన ఉన్నా.. మోడీకి, బీజేపీకి కొన్ని సానకూలతలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో ప్రతికూలతల సంగతేంటనే ప్రశ్నలూ లేకపోలేదు. మరి పొలిటికల్ బాహుబలిగా ఎదిగిన మోడీ.. తన ఛరిష్మాను మరో నాలుగేళ్లు నిలబెట్టుకుంటారా..? ప్రజల్ని మరోసారి […]
ఇరాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. టెహ్రాన్ కూడా కౌంటర్ అటాక్ చేస్తోంది. అమెరికా కూడా వార్నింగ్‌లు ఇస్తోంది. అణు ఒప్పందం చేసుకుంటారా, లేదా.. ఖబర్దార్ అంటూ టెహ్రాన్‌ను హెచ్చరిస్తోంది. మరో యుద్ధం ముంచుకొస్తోంది. ఇప్పటికే రష్యా- ఉక్రెయిన్ మధ్య ఏళ్లుగా సాగుతున్న సమరం.. గాజాలో కొనసాగుతున్న అలజడి.. వీటికితోడు ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలోకి.. ఇతర దేశాలు ఎంటరైతే! ప్రపంచ దేశాలన్నీ రెండుగా విడిపోయి.. సమరశంఖం పూరిస్తాయా ? మూడో ప్రపంచ యుద్ధం రాబోతోందా ? ప్రపంచం ఉలిక్కిపడుతోంది. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. […]
తమ ప్రభుత్వంలో కక్ష సాదింపు చర్యలు ఉండవు ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ విచారణ సాగుతుందని దానిలో ప్రభుత్వ ప్రమేయం ఏమి ఉండదని, విచారణ అనంతరం నివేదికల ప్రకారమే చర్యలు ఉంటాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంటున్నారు. మొన్న కాళేశ్వరం విచారణకు కేసీఆర్ వెళుతుండగా అంత హంగామాచేయడం అవసరమా.. తాజాగా కూడా కేటీఆర్ విచారణ ను ఏదో జరగబోతున్నట్లుగా బీఆర్ఎస్ శ్రేణులు కూడా హంగామా చేస్తున్నట్లుగా దృష్టికి వచ్చిందని పొంగులేటి అంటున్నారు. విచారణ ల […]
Konda Surekha : వరంగల్ తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, పేదల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ మంత్రి కొండా సురేఖ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఆవాసం కల్పించాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆమె తెలిపారు. 15 సంవత్సరాల విరామం తర్వాత పేదలకు ఇళ్ల నిర్మాణం జరగడం ఎంతో గర్వకారణమని, ఇందుకు అనుకూలంగా ప్రభుత్వం రూ.22,500 కోట్లు వెచ్చించి నాలుగు సంవత్సరాల్లో 20 లక్షల ఇళ్ల […]
Balmuri Venkat : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే క్రమంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కౌంటర్ వేశారు. “చట్టంపై గౌరవం ఉందని చెబుతున్న కేటీఆర్ అదే సమయంలో విచారణను డైవర్ట్ చేయడానికి నాటకాలాడుతున్నాడు” అంటూ ఆయన విమర్శించారు. ప్రజల ఎదుట తాను నిర్దోషినంటూ సత్యహరిశ్చంద్రుడిలా నటిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. విచారణకు హాజరయ్యేందుకు మేం ఎవరినీ బలవంతంగా పిలవలేం కానీ, ఒక […]