నేడు మధురైలో మురుగన్ భక్త సమ్మేళనం. పాల్గొననున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. సుబ్రహ్మణ్యస్వామి భక్తులతో నిర్వహించనున్న భక్త సమ్మేళనం. తెలుగు రాష్ట్రాల్లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,750 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,350 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,20,000 లుగా ఉంది. నేడు హైదరాబాద్‌కు ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్. మధ్యాహ్నం గాంధీభవన్‌లో పంచాయతీరాజ్ రాష్ట్రకార్యవర్గ సమావేశం. మూడు […]
SWAN Green Carnival : హైదరాబాద్ నగరం మరోసారి పర్యావరణ పరిరక్షణకు తన నిబద్ధతను చాటుకుంది. జూన్ 14న ఫౌంటన్‌హెడ్ గ్లోబల్ స్కూల్ ప్రాంగణంలో సేవ్ వాటర్ అండ్ నేచర్ (SWAN) అనే ప్రముఖ ఎన్జీఓ ఆధ్వర్యంలో “గ్రీన్ కార్నివాల్” ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి SWAN అధ్యక్షురాలు, చైర్పర్సన్ శ్రీమతి మేఘన ముసునూరి నేతృత్వం వహించారు. కార్నివాల్‌కు ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు హాజరై పర్యావరణ పరిరక్షణకు తమ పూర్తి మద్దతు తెలిపారు. […]
GHMC : హైదరాబాద్ బల్దియా పరిధిలోని టౌన్ ప్లానింగ్ శాఖలో శుభ్రపరిచే చర్యలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ శ్రీకారం చుట్టారు. అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, కొందరిపై ఏసీబీ వలలో చిక్కిన ఘటనల నేపథ్యంలో శనివారం మొత్తం 27 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పుల్లో 13 మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లు (ACP), 14 మంది సెక్షన్ ఆఫీసర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ప్రమోషన్లు కూడా ఇచ్చారు. పని […]
Liquor Smuggling : ఆదిలాబాద్ జిల్లా మద్యం అక్రమ రవాణాకు కేంద్రంగా మారింది. మహారాష్ట్ర నుంచి మద్యం సీసాలను కొత్త ఎత్తుగడలతో తరలిస్తున్న కేటుగాళ్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. పోలీసుల నివేదిక ప్రకారం.. దేశిదారు మద్యం తరలింపులో నూతన మార్గాలు వెతుక్కుంటూ ప్రత్యేకంగా తయారు చేసిన జాకెట్లను దుండగులు ఉపయోగిస్తున్నారు. మద్యం సీసాలను ఈ జాకెట్లలో దాచిన వీరంతా వాటిని ఒంటిపై వేసుకొని రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఈ కుట్ర బట్టబయలైంది. […]
సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో వార్షికోత్సవ సభ.. ఎల్లుండే కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్ […]
TGANB : తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై పోరుకు ఒక ముఖ్యమైన అడుగు వేయడంతో యాంటీ డ్రగ్ అవేర్నెస్ వీక్ వేడుకలు ప్రారంభమయ్యాయి. జూన్ 21 నుండి 26 వరకు జరగనున్న ఈ వారోత్సవాలను తెలంగాణ నార్కోటిక్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డీజీపీ జితేందర్ ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన, TGANB డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఇతర అధికారులు, వివిధ కళాశాలల విద్యార్థులు, ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు […]
స్మార్ట్‌ఫోన్.. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. పొద్దున లేచిన తర్వాత ముందుగా మొబైల్ ఫోన్ చూసిన తర్వాతమే మంచం దిగుతున్నారు. క్షణం ఫోన్ కనబడకపోతే ఏదో కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఫోన్లోనే ఉంటున్నారు. కానీ ఫోన్ సేఫ్టీ గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఫోన్లో డేటా డిలీట్ చేస్తే ఏమీ కాదని కొందరు భ్రమపడుతున్నారు. కానీ అదే ఫోన్ ఐపీ ద్వారా మొత్తం సమాచారం రికవరీ చేయొచ్చు. మనం అత్యాధునిక […]
Amit Shah : సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఈ ఒప్పంద నిబంధనలను పదేపదే ఉల్లంఘించిందని ఆయన మండిపడ్డారు. ఇన్నాళ్లూ దాయాది అన్యాయంగా భారత నీటిని వాడుక చేసిందని, ఇకపై ఆ దేశం నీటి కొరతకు ఎదురుకావాల్సిందేనని హెచ్చరించారు. ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా మాట్లాడుతూ.. అంతర్జాతీయ ఒప్పందాలను తులతూలకుండా రద్దు చేయలేమని, కానీ సింధూ ఒప్పందాన్ని […]
Padi Kaushik Reddy : హుజురాబాద్MLA పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. అయితే… కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. వైద్య పరీక్షల కోసం ఎంజీఎంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే.. ఇప్పటికే సుబేదారి పోలీస్ స్టేషన్‌కు బీఆర్ఎస్ లీగల్ టీం చేరుకుంది. ఈ సందర్భంగా కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎన్ని కుట్రలు చేసినా… రేవంత్ రెడ్డికి తలవంచం నిలదీస్తూనే ఉంటామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తన […]
జూలియన్ వెబర్ పై ప్రతీకారం తీర్చుకున్న నీరజ్ చోప్రా.. పారిస్ డైమండ్ లీగ్ లో విజయం పారిస్ డైమండ్ లీగ్ 2025 పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మొదటి స్థానాన్ని గెలుచుకున్నాడు. జూన్ 20న (శుక్రవారం) పారిస్‌లో జరిగిన ఈ ఈవెంట్లో నీరజ్ తన సమీప ప్రత్యర్థి జర్మనీకి చెందిన జూలియన్ వెబర్‌ను ఓడించాడు. గత రెండు టోర్నమెంట్లలో నీరజ్ వెబర్ చేతిలో ఓడిపోయాడు, కానీ ఇప్పుడు ఆ […]