Baba Vanga : అతీంద్రియ భవిష్య జ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బల్గేరియన్ భవిష్యవక్త బాబా వంగా (Baba Vanga) మరలా వార్తల్లోకెక్కారు. ఆమె చేసిన కొన్ని అద్భుత భవిష్యవాణులు ఇప్పటికే నిజమవ్వడం విశేషం. ఇప్పుడు ఆమె 2025 జూలై నుంచి డిసెంబర్ వరకు జరిగే పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా మూడు రాశులవారికి అదృష్టం, అభివృద్ధి, స్థిరత్వం లభిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఈ ఆరు నెలలు వారికి జీవితాన్ని మలుపు తిప్పేలా మారుతాయని చెబుతున్నారు.
1. కుంభ రాశి – శని, రాహుల అనుగ్రహం
2025 జూలై 13న శని గ్రహం రీట్రోగ్రేడ్ (హిమ్ముఖం) అవుతుంది. అదే సమయంలో మే నెలలో రాహు కుంభ రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ రెండు ముఖ్య గ్రహాల సంయోగం కుంభ రాశివారికి అభూతపూర్వ విజయాలు, వృత్తిపరంగా గొప్ప ఎదుగుదల కలిగిస్తుంది. కుంభ రాశివారు స్వతంత్రంగా ఆలోచించే వారు, విన్నవించుకునే తత్వాన్ని కలిగి ఉంటారు. 2025 రెండోార్థం వారికే కాదు.. వారి చుట్టూ ఉన్నవారికీ అవకాశాలను తెస్తుంది. ఈ సమయంలో వారి ఆలోచనా శక్తి, బిజినెస్, సృజనాత్మకత రంగాల్లో మంచి ఫలితాలు అందిస్తాయి. పేరు, పాపులారిటీ, ఆర్థిక స్వయం సమృద్ధి లభిస్తుంది. అయితే తాము ఉన్న తీరులో ఉండటం, ఒరిజినాలిటీ కొనసాగించాలనే సూచన ఉంది.
2. వృషభ రాశి – శుక్రుడు వరమిస్తాడు
వృషభ రాశి అధిపతి శుక్రుడు 2025 రెండోార్థంలో పూర్తి స్థాయిలో అనుకూలిస్తాడు. గత కొన్ని సంవత్సరాల్లో ఎదురైన సమస్యలకు ఈ ఆరు నెలలు పూర్తి స్వస్తి పలికేలా ఉంటాయి. శాంతి, స్థిరత, వృత్తి ఎదుగుదల, ఆర్థిక లాభాలు… అన్నీ వృషభ రాశివారిని ఆశీర్వదిస్తాయి. వారిలో ఉన్న ప్రాక్టికల్ ఆలోచన, కష్టపడే గుణం వారికి బలంగా నిలుస్తుంది. గతంలో కష్టపడి తలపట్టిన పనుల ఫలితాలు ఇప్పుడు అందే అవకాశం ఉంది. అయితే ఇతరుల సలహాలు తీసుకోవడం మంచిదే కానీ… వెంటనే నిర్ణయం తీసుకోకూడదని హెచ్చరిక ఉంది.
3. సింహ రాశి – గురు, మంగళ అనుకూలత
సింహ రాశిని సూర్యుడు పాలిస్తాడు. గురు, మంగళ గ్రహాల మిత్రత్వం వల్ల ఈ ఏడాది రెండో భాగంలో సింహరాశివారికి భారీ మార్పులు కన్పిస్తాయి. మంగళుడి శక్తి, ధైర్యం, మోటివేషన్ కారణంగా వారు అవసరమైన ఆత్మవిశ్వాసంతో ముందుకెళతారు. కొత్త వృత్తిపరమైన సంబంధాలు, బిజినెస్ పార్ట్‌నర్షిప్స్, గుర్తింపులు రాగలవు. గతంలో వచ్చిన భావోద్వేగ సంబంధ సమస్యలకు తెరపడుతుంది. ఈ దశలో వారు తమ లక్ష్యాలను ధైర్యంగా చేధించగలుగుతారు. కానీ అధిక ఆత్మవిశ్వాసం మాత్రం సమస్యగా మారొచ్చని హెచ్చరిక ఉంది. శాంతంగా, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
2025 రెండోార్థం ఈ మూడు రాశులవారికి అదృష్టాన్ని అందిస్తుందని బాబా వంగా చెప్పిన ఈ భవిష్యవాణి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవాలంటే కేవలం గ్రహాల అనుగ్రహం కాకుండా… తగిన ప్రణాళిక, కృషి, ఆత్మవిశ్వాసం కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.