Iran-Israel : ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనూహ్య మలుపు తిరగటానికి సిద్ధంగా ఉంది. ఒకటి రెండు రోజుల్లో అమెరికా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా ఎంటరైతే.. జరగబోయే పరిణామాలపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇంతకూ సిచ్యువేషన్ రూమ్ లో వ్యూహం ఖరారైందా..? అమెరికా ముందున్న ఆప్షన్లేంటి..? ఇరాన్ లో ఏం చేస్తే అమెరికాకు లాభం..? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆ రెండు దేశాల పరిధి దాటిపోయింది. ఇప్పుడు యుద్ధం కొనసాగింపు, ముగింపుపై అమెరికాదే తుది నిర్ణయం […]
Gajarla Ganesh : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని వెలిశాల గ్రామం ఈరోజు తీవ్ర ఉద్వేగానికి లోనైంది. మావోయిస్టు కీలక నేత గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ మృతి పట్ల గ్రామవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి తరువాత గాజర్ల రవికి సంబంధించిన మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం వెలిశాలలో అతని అంత్యక్రియలు జరగనున్నాయి. గాజర్ల రవి మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఆయన అభిమానులు, మావోయిస్టు సానుభూతిపరులు, […]
Yoga Day : యోగాను వర్ణించే పతంజలి, ఒక సూత్రంలో “యోగం అంటే మనస్సు , బుద్ధి వృత్తుల నుండి విముక్తి.” ఇలా అంటాడు. మరింత వివరిస్తూ “మనస్సుకు ఐదు వృత్తులు ఉన్నాయి – ప్రతిచోటా న్యాయాన్ని కోరుకోవడం, వాస్తవికతను తప్పుగా గ్రహించడం, ఊహ, నిద్ర , జ్ఞాపకశక్తి.” అని పేర్కొన్నారు. రోజంతా మీ మనస్సు వీటిలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కార్యకలాపాలలో నిరంతరం నిమగ్నమై ఉంటుంది. కానీ రోజులో ఏ సమయంలోనైనా మీరు నిద్రపోకపోతే, […]
Hyderabad : హైదరాబాద్ నగరంలోని పారా మౌంట్ కాలనీలో తెల్లవారుజామున పెద్దఎత్తున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమ చట్టవ్యతిరేక కార్యకలాపాలు, విదేశీయుల అక్రమ నివాసాలపై ఆధారంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టారు. సుమారు 150 మంది పోలీసులు తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ కాలనీని చుట్టుముట్టి సోదాలు ప్రారంభించారు. లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్, హెచ్ఎన్యూ, ఏఆర్ విభాగాలకు చెందిన పోలీసులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు. ఈ సెర్చ్‌లో నైజీరియా, […]
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు మూడు రెట్లు పెరిగాయ్ 2023తో పోలిస్తే 2024లో భారతీయులు స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన డబ్బు మూడు రెట్లు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు (సుమారు రూ. 37,600 కోట్లు) చేరుకుంది. స్థానిక శాఖలు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా స్విస్ బ్యాంకుల్లో ఉంచిన డబ్బులో భారీ పెరుగుదల కారణంగా ఈ పెరుగుదల సంభవించింది. 2023లో, ఈ మొత్తం నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయి 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లకు […]
Yogaday Countdown : జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం రంగురంగుల తీర్చిదిద్దింది. ఈ సందర్భంగా జూన్ 20న 24 గంటల ముందు కౌంట్‌డౌన్ మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. యోగా ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసిన ఘనత భారత్‌దే అని పలువురు ప్రముఖులు ఈ వేడుకల సందర్భంగా తెలియజేశారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని అందరూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, మాజీ […]
నేడు భారత్-ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్. ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న భారత్. లీడ్స్ వేదికగా మధ్యాహ్నం 3.30కి మ్యాచ్. విశాఖ: నేడు విశాఖకు రానున్న ప్రధాని నరేంద్రమోడీ. సాయంత్రం 6.45 నిముషాలకు ఐఎన్ఎస్ డేగా వైమానిక స్థావరానికి చేరుకోనున్న ప్రధాని. స్వాగతం పలుకనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎంపీలు. పెహల్గం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన చంద్ర మౌళి భార్యకు ప్రధానిని కలిసే అవకాశం.. స్వాగత కార్యక్రమాల తర్వాత తూర్పు నావికాదళ […]
NTV Daily Astrology as on June 20th 2025: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Suicide : హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్గం చెరువులో ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. బాధితురాలిని సుష్మ (27)గా గుర్తించారు. ఈ రోజు తెల్లవారుఝామున 4 గంటలకు బొట్టు అంజయ్య అనే వ్యక్తి మిస్సింగ్ కంప్లైంట్‌ను మాదాపూర్ పోలీసులకు ఇచ్చారు. “ఆఫీస్‌కు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన సుష్మ తిరిగి రాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. […]
Shocking Incident : హైదరాబాద్ పాతబస్తీలోని ఐ.ఎస్. సదన్ ప్రాంతంలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసన చూసి స్థానికులు అనుమానం పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేటలో ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సంబంధిత ఇంటిని పరిశీలించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇంటి అంతా రక్తపుదారలు కనిపించడంతో […]