Siraj : ఉగ్రకదలికలపై తీవ్ర దృష్టిసారించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), హైదరాబాద్‌లో కీలకంగా మకాం వేసిన సిరాజ్ అనే వ్యక్తి చుట్టూ దర్యాప్తును ముమ్మరం చేసింది. గత ఏడు సంవత్సరాలుగా గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో హైదరాబాద్‌లో తిష్ట వేసిన సిరాజ్, పక్కా వ్యూహంతో కార్యకలాపాలను సాగించినట్లు అధికారులు గుర్తించారు. సిరాజ్‌తో కలిసి ఉన్న సమీర్ అనే వ్యక్తి – హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ చేసినట్లు తెలిసింది. గత సంవత్సరం నవంబరు […]
కాశ్మీర్లో యుద్ధ బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఇటీవల భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల సందర్భంగా పూంఛ్ ప్రాంతంలో ఆస్తులు కోల్పోయిన బాధిత కుటుంబాలను రాహుల్‌గాంధీ పరామర్శించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దాయాది దేశం సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దాయాది సైనిక చర్యలకు జమ్మూకాశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. దీంతో పూంఛ్ ప్రాంతంలో అనేక నివాసాలు దెబ్బతిన్నాయి. ఒక […]
Lion Attack: అడవి రాజు సింహం గురించీ ఎవరికీ కొత్తగా చెప్పక్కర్లేదు. దాని గొంతు వినగానే ముక్కు మీద చెమట పట్టేసే గంభీరత దానిసొంతం. అలాంటి సింహం బోనులో ఉన్నా.. బయట ఉన్నా ఒళ్లు దగ్గరపెట్టుకొని ప్రవర్తించాలి. అలా కాదని కొంటె చేష్టలతో దాన్ని రెచ్చగొడితే ఈ వ్యక్తి జరిగిన గతే పడుతుంది. ఈ వీడియలో కనిపించే వ్యక్తి సింహం బొమ్మ అనిపించిందో ఏమో కానీ, నిజంగా ఉన్న సింహాన్ని ఆటబొమ్మలా చూసాడు. బోను దగ్గరగా వెళ్లి […]
Sama Ram Mohan Reddy : తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ లోపలి కలహాలు ముదిరిపోతున్న నేపథ్యంలో పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ విషయాన్ని పది రోజుల క్రితమే తాను ఊహించానని ఆయన స్పష్టం చేశారు. ఈ లేఖ వెనుక ఉన్న అసలైన కుట్రలు ఇప్పుడు బయటపడుతున్నాయని ఆరోపించారు. కవితను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే స్కెచ్ వేసిన బృందం పని చేస్తోందని, సంతోష్ రావు, కేటీఆర్, […]
Minister Seethakka : తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ పరిసర గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ముఖ్యంగా అటవీ శాఖ నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులపై చర్చ జరిగింది. ఈ సమన్వయ సమావేశానికి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, అటవీశాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, ఐటిడిఎ అధికారులు హాజరయ్యారు. మంత్రి సీతక్క […]
Mahesh Goud: తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ జన్మదిన వేడుకలు శుక్రవారం మియాపూర్‌లోని సహాయా ఓల్డ్ ఏజ్ హోమ్ లో హృదయపూర్వకంగా నిర్వహించబడ్డాయి. వృద్ధుల మధ్య ఈ వేడుకలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాజు, ఆయన స్నేహితుల బృందం సంయుక్తంగా నిర్వహించారు. మానవత్వాన్ని ప్రతిబింబించే ఈ వేడుకలో సహాయా ఫౌండేషన్‌కు చెందిన లయన్ డాక్టర్ రఘు, లయన్ డాక్టర్ నీలూ ముఖ్య అతిథులుగా హాజరై, మహేశ్ […]
TPCC Mahesh Goud : ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇంట్లో కుంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతం అవుతున్నాడని, ఎకు మేకై మరో పవర్ సెంటర్ రావడంతో మతిభ్రమించి, రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ మాట్లాడారని ఆయన మండిపడ్డారు. కవిత […]
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బసవేశ్వరుడి చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని, సమానత్వంపై దృష్టి సారిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. […]
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో టికెట్ ధరలు ఇటీవల 20 శాతం పెరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెంపుపై ప్రయాణికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రజలు ధరలు తగిలించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాస్తూ, అధిక టికెట్ రేట్లు నగర ట్రాఫిక్‌ను మరింతగా పెంచుతాయని హెచ్చరించారు. Mukesh Ambani: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంపై మోడీకి ముఖేష్ అంబానీ అభినందనలు ఈ నేపథ్యాన్ని […]
త్వరలోనే పెళ్లి.. ఇంతలో దుండగుడి కాల్పుల్లో ఇజ్రాయెల్ దౌత్య జంట మృతి ఆ జంట అందమైన జంట. చూడముచ్చటైన జంట. చిలకాగోరింకల్లా ఉన్నారు. వివాహం అనే బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని కలలు కన్నారు. కోరుకున్న చెలిమి దొరికిందని ఎంతగానో మురిసిపోయాడు. జెరూసలేంలో ఆమెకు ప్రపోజ్ చేసేందుకు ఉంగరం కూడా తీసుకున్నాడు. కానీ అంతలోనే మృత్యువు ఎదురొస్తుందని ఊహించలేకపోయాడు. ఓ దుర్మార్గుడు అకస్మాత్తుగా వచ్చి కాల్పులకు తెగబడడంతో అక్కడికక్కడే జంట నేలకొరిగింది. ఈ విషాద ఘటన వాష్టింగ్టన్‌లోని […]