ఆ మాజీ మంత్రుల్లో అసహనం టన్నులు టన్నులుగా పేరుకుపోతోందా? తమకు ప్రాధాన్యం దక్కకపోవడం ఒక ఎత్తయితే… జూనియర్స్ తెగ పెత్తనాలు చేస్తున్నారంటూ రగిలిపోతున్నారా? ఇన్నాళ్ళు సిన్సియర్‌గా ఉన్న సీనియర్స్… ఇప్పుడు పార్టీ లక్ష్మణ రేఖ దాటుతున్నారా? ఎవరా సీనియర్స్? వాళ్ళ మనోభావాలు ఎక్కడెక్కడ దెబ్బతింటున్నాయి? తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. కేడర్ నుంచి లీడర్స్ వరకు అందరిదీ… అధినాయకత్వం మీద వీరవిధేయతే తప్ప వ్యతిరేకత అన్న మాటే వినిపించదు. ఈ ప్రాంత నాయకత్వం పార్టీ క్రమశిక్షణ దాటి […]
అదిగో..ఇదిగో… అంటారు.. తీరా ఆ టైం వచ్చేసరికి తూచ్… లేదు పొమ్మంటారు. ఊరించి ఊరించి ఊసూరుమనిపిస్తారు. తెలంగాణ ప్రభుత్వం విషయంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఇంతకీ ఏ విషయంలో సర్కార్ అంతలా టార్గెట్ అవుతోంది? ముందు ఆర్భాటపు ప్రకటనలు చేసి తర్వాత వెనక్కి తగ్గడం వెనకున్న రీజన్స్ ఏంటి? జూన్ 2 నుంచి రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఆ రోజు గడిచిపోయినా… పథకం ప్రారంభంలేదు, అసలా ఊసేలేదు. ఎందుకలా […]
జీవో ఇచ్చి 24 గంటలు కూడా గడవక ముందే ఏపీ సర్కార్ ఎందుకు యూ టర్న్ తీసుకుంది? తుని రైలు దహనం కేసు రీ ఓపెన్ కోసం ఉత్తర్వులు ఇచ్చి వెంటనే ఉపసంహరించుకోవడానికి కారణం ఏంటి? తెర వెనక కథ ఏం జరిగింది? పర్యవసానాలు గరించి ముందే ఆలోచించకుండా జీవో ఇచ్చేశారా? ఏ స్థాయిలో ఫైల్ కదిలి జీవో బయటికి వచ్చింది? ఉత్తర్వులు ఇచ్చిందెవరు? ఆపిందెవరు? కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌తో 2016 జనవరి 31న తునిలో […]
Ponguleti Srinivas Reddy : పశువైద్యశాల ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నా అభివృద్ధి పనులు ఆపకుండా, ప్రజలకు సంక్షేమ పథకాలు నిరాటంకంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. […]
Uttam Kumar Reddy : బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వ నిరసన కొనసాగుతోంది. తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తమ స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఇప్పటివరకు కావాల్సిన అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకా చేయాల్సినవి ఉంటే… అవి కూడా చేస్తాం. ఈ విషయంలో తాము ఏమాత్రం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు” అని మంత్రి స్పష్టం చేశారు. ఇక రెండు రోజుల్లో ప్రాజెక్టుపై మరింత […]
కాంగ్రెస్ చట్టాలు రైతులకు మేలు చేస్తే.. బీఆర్ఎస్ చట్టాలు ప్రజలకు ఇక్కట్లను తెచ్చాయి తెలంగాణ ఆవిర్భావం జూన్ 02 రోజున భూ భారతి చట్టం అమల్లోకి వచ్చింది. భూ సమస్యలను లేకుండా చేసేందుకు రేవంత్ సర్కార్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా నేటి నుంచి ఈ నెల 20 వరకు అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. భూ భారతి చట్టం చరిత్రాత్మకం అని అన్నారు. […]
Telangana Jagruthi : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది. జూన్ 4న బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ మహాధర్నా ఇందిరా పార్క్ వద్ద జరగనుంది. ఈ ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్వయంగా నేతృత్వం వహించనున్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్‌పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ, ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ […]
TG Cabinet : రాష్ట్రంలో కొనసాగుతోన్న తెలంగాణ ప్రభుత్వం కీలక అభివృద్ధి, పరిపాలనా అంశాలపై చర్చించేందుకు జూన్ 5న కేబినెట్ సమావేశం నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలకు వేదికకానుంది. ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై చర్చ జరగనుంది. ముఖ్యంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన నివేదికపై ఈ సమావేశంలో విశ్లేషణ […]
Sama Ram Mohan Reddy : తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. పీసీసీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ ప్రవీణ్ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. దళిత విద్యార్థుల సంక్షేమ పథకాల పేరుతో నిధులను పక్కదారి మళ్లించారని ఆరోపించారు. 240 మంది విద్యార్థులకు కోడింగ్ నేర్పించడానికి […]
Medical Assistance: జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని వెంకటాద్రి పేట గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆరోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్నాడు. మెడ నరాలలో సమస్య కారణంగా తీవ్రమైన క్షీణతకు గురవుతున్న ఆయన, వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చును భరించలేని పరిస్థితిలో ఉన్నాడు. రాజుకు అవసరమైన చికిత్స కోసం దాదాపు ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని అంచనా. గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న రాజు ఆ మొత్తంను భరించే ఆర్థిక స్థితిలో లేడు. ఈ క్రమంలో […]